Alcohol Consumption | మహిళలు ఒక పెగ్గు, పురుషులు రెండు పెగ్గులు వేస్తే.. గుండెముప్పు తప్పుతుందటా!
న్యూయార్క్: తగు మోతాదులో మద్యపానం (Alcohol Consumption) చేయడం వల్ల మెదడుపై ఒత్తిడి (Stress) తగ్గుతుందని తద్వారా గుండెపోటును తప్పించుకోవచ్చని ఒక అధ్యయనం పేర్కొంది. జర్నల్ ఆఫ్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం. మెదడు ఆరోగ్యంగా ఉండటానికి మహిళలకు ఒక పెగ్గు, పురుషులకైతే రెండు పెగ్గులు సరిపోతాయి. 50 వేల మందిపై ఈ పరిశోధన చేసి ఎందుకు ఆల్కహాల్ తీసుకునే వారిలో గుండెపోటు ముప్పు తక్కువ ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం […]

న్యూయార్క్: తగు మోతాదులో మద్యపానం (Alcohol Consumption) చేయడం వల్ల మెదడుపై ఒత్తిడి (Stress) తగ్గుతుందని తద్వారా గుండెపోటును తప్పించుకోవచ్చని ఒక అధ్యయనం పేర్కొంది. జర్నల్ ఆఫ్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.
మెదడు ఆరోగ్యంగా ఉండటానికి మహిళలకు ఒక పెగ్గు, పురుషులకైతే రెండు పెగ్గులు సరిపోతాయి. 50 వేల మందిపై ఈ పరిశోధన చేసి ఎందుకు ఆల్కహాల్ తీసుకునే వారిలో గుండెపోటు ముప్పు తక్కువ ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అస్సలు మందు తీసుకోని వారితో పోలిస్తే స్వల్ప లేదా మధ్యస్థంగా మందు తీసుకునే వారిలో మెదడులోని స్ట్రెస్‌కు కారణమైన అమిగ్డాలా భాగం కాస్త నిద్రాణంగా ఉంటోందని తెలిపారు. ఈ అమిగ్డాలా భాగం ఉత్తేజితంగా ఉంటే రక్తపోటు, గుండె వేగాన్ని పెంచుతోందని గుర్తించారు.
దీని వల్ల ఒత్తిడి తద్వారా హైపర్ టెన్షన్, ఊబకాయం వచ్చి గుండెపోటు ముంచుకొస్తుందని హెచ్చరించారు. మద్యం అమిగ్డాలాను నిద్రాణ స్థితిలో ఉంచుతుందని ఇప్పటికే తెలిసినప్పటికీ దీర్ఘకాలంలో గుండెముప్పుపై దీని ప్రభావాన్ని నిర్ధారించిన అధ్యయనం ఇదే మొదటిదని పరిశోధకులు పేర్కొన్నారు.
అయినా తాగొద్దు
ఈ అధ్యయనాన్ని చదివి పెగ్గు మీద పెగ్గు కొట్టు.. సోడా వేసి దంచికొట్టు అని పాడుకుంటూ తాడుదాం అనుకుంటున్నారా.. మద్యపానం వల్ల వచ్చే నష్టాలను ఈ చిన్న చిన్న లాభాలు పూడ్చలేవని ఈ అధ్యయనం హెచ్చరించింది.
మద్యపానం వల్ల క్యాన్సర్ ముప్పుతో పాటు, వారానికి 14 పెగ్గుల కన్నా ఎక్కువ తాగితే గుండెపోటు, మెదడు మొద్దు బారడం తదితర సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందని తెలిపింది. ఈ కారణాల వల్లనే ఒత్తిడి, గుండెపోటుల నుంచి తప్పించుకోడానికి మద్యం తీసుకోమని మేం సూచించడం లేదని అధ్యయనానికి నేతృత్వం వహించిన డా.టవాకోల్ స్పష్టం చేశారు.