Srisailam Gates Open| పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. శ్రీశైలం గేట్లు ఎత్తివేత

Srisailam Gates Open| పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. శ్రీశైలం గేట్లు ఎత్తివేత

విధాత: కృష్ణానది(Krishna River) ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరద(Floods) నేపథ్యంలో ఈ వర్షాకాలం సీజన్ లో శ్రీశైలం(Srisailam Dam) ప్రాజెక్టు గేట్ల(Gates Open)ను మరోసారి ఎత్తి దిగువకు నీటి విడుదల(Water Release) చేస్తున్నారు. జూరాల, సుంకిశాల ప్రాజెక్టుల నుంచి.. శ్రీశైలం జలాయానికి భారీగా వరద వస్తుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో..  మొత్తం 12 గేట్లకుగాను 8 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2,65,888 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 3,11,279 క్యూసెక్కులు కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుతం 882.50 అడుగులుగా ఉంది.

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఇటు దిగువన నాగార్జున సాగర్(Nagarjuna Sagar) ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. ఈ నేపధ్యంలో నాగార్జున సాగర్ గేట్లను కూడా మరోసారి తెరిచే అవకాశముంది.