Peddareddy Tadipatri visit| 5వ తేదీ తర్వాత తాడిపత్రికి వెళ్లండి: పెద్దారెడ్డికి అనంతపురం ఎస్పీ లేఖ
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు 5వ తేదీ తర్వాత భద్రత కల్పిస్తామని అనంతపురం ఎస్పీ లేఖ.
అమరావతి : వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( Peddareddy)తన సొంత నియోజకవర్గం తాడిపత్రి(Tadipatri) వెళ్లేందుకు ఈ నెల 5వ తేదీ తర్వాత డేట్ ఫిక్స్ చేసుకోవాలని అనంతపురం ఎస్పీ Anantapur SP,జగదీష్ ఆయనకు లేఖ రాశారు. తాడిపత్రి పర్యటన కోసం పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు వివరాలు మీకు అందచేస్తామని..సంబంధిత డబ్బులు డిపాజిట్ చేయాలని ఎస్పీ పెద్దారెడ్డికి లేఖలో సూచించారు. సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు తనకు తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి..భద్రతకు చర్యలు తీసుకోవాలని పెద్దారెడ్డి ఎస్పీకి లేఖ రాశారు. అయితే గణేష్ నిమజ్జనం, మిలావుద్ నబీ పండుగల బందోబస్తు నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు భద్రత అందించలేమని..5వ తేదీ తర్వాతే వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని..రెండు రోజుల ముందే తాడిపత్రికి వెళ్లే తేదీ వివరాలు అందించాలని ఎస్పీ తన లేఖలో బదులిచ్చారు. ఎస్పీ సూచలను పెద్దారెడ్డి అంగీకరించారు. తాను పోలీసుల సూచనలను పాటిస్తానని..తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరిస్తానన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేతిరెడ్డి పెద్ధారెడ్దికి తాడిపత్రికి వెళ్లేందుకు శాంతిభద్రతల సమస్యల పేరుతో పోలీసులు నిరాకరిస్తు వస్తున్నారు. దీనిపై పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయనకు తాడిపత్రి వెళ్లేందుకు అనుమతించింది.
‘ఓ వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు..?’ అని పోలీసులను ఘాటుగా ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భద్రతా ఖర్చును భరించాలని పెద్దారెడ్డికి సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు పోలీసులు చర్యలు చేపట్టారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy)కి, పెద్దారెడ్డికి ఉన్న గొడవల నేపథ్యంలో పెద్దారెడ్డి భద్రతకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram