Yadagirigutta| యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్ర పూజలు
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు గిరిప్రదక్షిణ వైకుంఠద్వారం వద్ధ పూజలతో ప్రారంభించారు

విధాత, హైదరాబాద్ : యాదగిరి గుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Yadagirigutta) జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం(Swathi Nakshatram) సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు గిరిప్రదక్షిణ వైకుంఠద్వారం వద్ధ పూజలతో ప్రారంభించారు. మాజీ మంత్రి టి.హరీష్ రావుHarish Rao, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట టెస్కబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.