Tirumala| తిరుమలలో మరో వివాదం.. భూత కోల ప్రదర్శనపై అభ్యంతరాలు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భూత కోల జానపద నృత్య ప్రదర్శన చేయడం పట్ల శ్రీవారి భక్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో అసలు తిరుమలలోని ఆగమ శాస్త్ర నిపుణులు ఏం చేస్తున్నారు? అంటూ శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు.

Tirumala| తిరుమలలో మరో వివాదం.. భూత కోల ప్రదర్శనపై అభ్యంతరాలు

విధాత : తిరుమల(Tirumala) శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో(Brahmotsavam) భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భూత కోల(Bhoot Kola) జానపద నృత్య ప్రదర్శన చేయడం పట్ల శ్రీవారి భక్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భూతకోల వంటివి హిందూ సంప్రదాయంలో భాగం కాదని.. ఇలాంటివి తిరుమలలోనే కాదు, ఏ ఆలయాల్లోనూ నిర్వహించకూడదని చెబుతున్నారు. భూతకోల ఆత్మలకు సంబంధించిన ఆచారంగా పేర్కొంటున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆగమ శాస్త్రం, సాంప్రదాయాలు..సంస్కృతులకు సంబంధించిన ప్రదర్శనలు మాత్రమే నిర్వహించాలని..అవగాహన లేకుండా భూత కోల ప్రదర్శన నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అసలు తిరుమలలోని ఆగమ శాస్త్ర నిపుణులు ఏం చేస్తున్నారు? అంటూ శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు.

భూతకోల..వరాహారూప ఆరాధన

భూతకోల వరాహారూప ఆరాధన ప్రక్రియ కూడా అని..వరాహా స్వామి కొలువైన తిరుమల కొండపై ఈ ప్రదర్శన తప్పేలా అవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ‘కాంతార’ అనే కన్నడ సినిమా ద్వారా ఈ భూత కోలా నృత్య పూజలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. భూత అంటే ప్రకృతి శక్తి.. కోలా అంటే తుళు భాషలో నృత్యం అనే అర్ధం వస్తుంది. భూత’ లేక ‘భూతం’కీ మధ్య వ్యత్యాసం ఏంటి? అనే దానిపై కూడా.. సంస్కృతంలోనూ, మన పురాతన భాషలలోనూ, భూత అంటే కాలం అనీ, ప్రకృతి శక్తులనీ అర్ధాలు వస్తాయంటున్నారు. ముఖ్యంగా మనుషులతో పాటు, సకల జీవరశూలనూ రక్షించే ప్రకృతి శక్తులను, భూత గణాలని అంటూ ఉంటారు. దాని వల్ల, భూత ప్రకృతి అయితే, భూతం దాని వికృతి పదం అని, భాషా వేత్తలు చెబుతున్నారు. ఆ పరంగా, భూత గణాలు జీవరాశిని రక్షించే శక్తులైతే, భూతం అనేది, దుష్ట శక్తికి ఉండే పేరుగా మారినట్లు, నిపుణులు చెబుతున్నారు. భూత కోలా అనే నృత్యాన్ని, నేటికీ దక్షిణ కన్నడ కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా చూడవచ్చు. పంజర్లీ(వరాహం), గుళిగ అనే దేవుళ్లు కూడా ప్రకృతి దేవతలని..శివ పార్వతుల సృష్టి అని చెబుతున్నారు. వరాహాన్ని పంజర్లీ అనే పేరుతో కొలుస్తూ భూతకోలా ద్వారా పూజించడం జరుగుతోందని చెబుతున్నారు. అందుకే ప్రకృతి దైవాలను భూతాలుగా పేర్కొనడాన్నివారు వ్యతిరేకిస్తున్నారు.