Jagadish Reddy|కాళేశ్వరం పంప్ లు ఆన్ చేయండి: మాజీ మంత్రి జీ.జగదీష్ రెడ్డి

Jagadish Reddy|కాళేశ్వరం పంప్ లు ఆన్ చేయండి:  మాజీ మంత్రి జీ.జగదీష్ రెడ్డి

విధాత : కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంపు హౌస్ వద్ద నీళ్ళు అందుబాటులో ఉన్నాయని..మేడిగడ్డ కు సంబంధం లేకుండా నీళ్లు తీసుకునే అవకాశం ఉందని..కావాలనే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ నీళ్లివ్వడం లేదని మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. గోదావరి వరదల నేపధ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా కన్నెపల్లి పంపు హౌస్, మేడుగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను పరిశీలించానని..ప్రాజెక్టుకు ఎక్కడ ఎలాంటి ప్రమాదం లేదన్నారు. గత ఏడాది కాళేశ్వరం నీళ్లు నల్గొండకు చేరాయని..ఇప్పుడు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందన్నారు. పంట సాగు సీజన్ అయిపోతున్నప్పటికి ప్రభుత్వానికి నీటి విడుదలపై సోయి లేదని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. బుర్రలేని నీళ్ళ మంత్రి ఉత్తమ్, అజ్ఞాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు.

ప్రాజెక్టులు కట్టుకునేదే అవసరానికి నీళ్ళు వాడుకోవడానికని..వెంటనే కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలకి చేతకాక పోతే కేసీఆర్ కు అప్పచెప్పండని.. 3 రోజుల్లోనే నీళ్ళు అందిస్తామన్నారు. సీఎం రేవంత రెడ్డి పెన్ను పేపర్ తీసుకొని కేసీఆర్ దగ్గరికి వస్తే..అలాంటి ఆజ్ఞానికి కూడా అర్ధం అయ్యేలా చెప్పే జ్ఞానం కేసీఆర్ కు ఉందన్నారు. నీళ్ళు అందించకపోతే ఏం చేయాలో కేసీఆర్ కి తెలుసన్నారు. ఇప్పటికే రెండు పంటలు ఎండబెట్టారని..మీ అత్యాశ, మూర్ఖత్వం, అజ్ఞానం, వల్ల రాష్ట్రం తిరోగమనం అవుతుందని విమర్శిచారు. పదేండ్లు నిరంతరం ఇచ్చిన కరెంటు ఇప్పుడు ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియడం లేదన్నారు. నిత్యం కేసీఆర్ మీద పడి ఏడ్వడం తప్పా రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రా ఆదాయం పడిపోతుందన్నారు.