Outsourcing Job Fraud| అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 2లక్షలు వసూలు

Outsourcing Job Fraud| అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 2లక్షలు వసూలు

విధాత : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అవుట్ సోర్సింగ్ (Outsourcing Jobs)ఉద్యోగాలు చేస్తున్న వారికే సకాలంలో జీతాలు అందక..ఎలాంటి ఉద్యోగ వసతులు లేక నానా కష్టాలు పడుతున్నారు. అయినప్పటికి జీవనోపాధి కోసం ఏదో ఒక ఉద్యోగం అనుకుంటూ నిరుద్యోగులు ఉద్యోగ వేటలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలైన ఫర్వాలేదనుకుంటూ వాటి కోసం తిప్పలు పడుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం దళారులకు, ఏజెన్సీలకు డబ్బులిచ్చి మోసపోతున్నారు. అలాంటి ఘటనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం(Vemulawada  Devasthanam)లో చోటుచేసుకుంది. ప్రసాదాల తయారీ, శానిటేషన్ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు(Outsourcing Job Fraud) ఇప్పిస్తానంటూ శాన్వీ సర్వీసెస్ అవుట్ సోర్సింగ్ సూపర్ వైజర్ లక్ష్మీనారాయణ(Lakshminarayana)  ఇద్దరి నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనకు సంబంధించిన ఆడియో వైరల్ గా మారింది.

అయితే ఎంతకు ఉద్యోగం విషయమై తేల్చకుండా..దాటవేస్తుండటంతో బాధితులు లక్ష్మీనారాయణ మోసంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దేవస్థానం ఈవో రాధబాయి సైతం ఈ వ్యవహారంలో లక్ష్మీ నారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు.