Home Guard Suicide Attempt| గోరంట్ల మహిళా హోంగార్డు ఆత్మహత్య యత్నం
ఏపీలోని శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్లలో ఆదివారం ఓ మహిళ హోంగార్డు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటక కలకలం రేపింది.
అమరావతి : ఏపీలోని శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్లలో(Gorantla) ఆదివారం ఓ మహిళ హోంగార్డు (woman home guard) ఆత్మహత్యయత్నానికి(suicide attempt) పాల్పడిన ఘటక కలకలం రేపింది. గోరంట్ల పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డు ప్రియాంక కూల్ డ్రింక్‌లో వ్మాస్మోల్ రసాయన ద్రావణం కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసు డ్రైవర్ షఫీ, నంద్యాల త్రిటౌన్ సీఐ కంబగిరి రాముడు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోను విడుదల చేసింది.
ఎస్పీ, డీఐజీలకు ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. హోంగార్డు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. హోంగార్డు ఆత్మహత్య యత్నాన్ని గమనించిన పోలీసులు ఆమెను గోరంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురం తరలించారు. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు శాఖపరమైన విచారణకు ఆదేశించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram