Earthquake | జమ్మూకశ్మీర్‌లో మరోసారి భూప్రకంపనలు
Earthquake | జమ్మూకశ్మీర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. జమ్మూకశ్మీర్‌లోని కత్రా, దోడా ఏరియాల్లో బుధవారం ఉదయం వరుసగా మూడు సార్లు భూకంపం సంభవించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భూకంపం చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. బుధవారం తెల్లవారుజామున 2:20 గంటలకు భూకంపం సంభవించగా, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం కత్రాకు 81 కిలోమీటర్ల దూరం కేంద్రీకృతమైంది. ఉదయం […]

Earthquake | జమ్మూకశ్మీర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. జమ్మూకశ్మీర్‌లోని కత్రా, దోడా ఏరియాల్లో బుధవారం ఉదయం వరుసగా మూడు సార్లు భూకంపం సంభవించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భూకంపం చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు.
బుధవారం తెల్లవారుజామున 2:20 గంటలకు భూకంపం సంభవించగా, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం కత్రాకు 81 కిలోమీటర్ల దూరం కేంద్రీకృతమైంది.
ఉదయం 7:56 గంటలకు రెండోసారి 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 8:29 గంటలకు 3.3 తీవ్రతతో మూడోసారి భూకంపం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు.
నిన్న కశ్మీర్‌లోని దోడా ఏరియాలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదైంది. పలు చోట్ల భవనాలు దెబ్బతిన్నాయి. ఐదుగురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు.