ఇండియాలో 5జీ సేవలు.. ప్రారంభించిన ప్రధాని.. ప్రస్తుతం అక్కడ మాత్రమే!
విధాత, ఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా నాలుగో పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్న 5జీ టెలికం సేవలు మన దేశంలోనూ మొదలయ్యాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌ను ప్రారంభించి, 5 జీ సర్వీసెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాల్లోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలిదశలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, చండీగఢ్, గాంధీనగర్, గురుగ్రాం, లక్నోలో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. […]

విధాత, ఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా నాలుగో పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్న 5జీ టెలికం సేవలు మన దేశంలోనూ మొదలయ్యాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌ను ప్రారంభించి, 5 జీ సర్వీసెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు.
ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాల్లోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలిదశలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, చండీగఢ్, గాంధీనగర్, గురుగ్రాం, లక్నోలో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
రెండేళ్లలో దేశమంతటా 5 జీ సేవలు విస్తరించనున్నారు. ఇప్పటికే అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. అక్కడా ఈ సేవలు కొన్ని నగరాల్లోనే ఉన్నాయి. 5జీ సేవలు ప్రారంభించడానికి ముందు.. టెలికాం సంస్థల స్టాళ్లను మోదీ పరిశీలించారు.

అక్కడి స్టాళ్లలో కలియతిరిగారు. జియో, ఎయిర్టెల్ సహా పలు సంస్థల 5జీ ఉత్పత్తులను వీక్షించారు. ఆయా కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తుల గురించి మోదీకి వివరించారు. ప్రత్యేక కళ్లద్దాలు ధరించి వీడియోలు వీక్షించారు. ఓ స్టాల్లో వీడియో గేమ్ సైతం ఆడారు.