Gandhi Bhavan: విభజన హామీలు అమలు చేయని కేంద్రం: సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్
విధాత: కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ మోడీని ప్రశ్నిస్తూ, నటిస్తూ, వారికే అనుకూలంగా ఉంటున్నారన్నారు. మరో వైపు ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారన్నారు. దీంతో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య బంధం అందరికీ అర్థం అయితున్నదరన్నారు. విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఐటీలు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైనయని బెల్లయ్య […]
విధాత: కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ మోడీని ప్రశ్నిస్తూ, నటిస్తూ, వారికే అనుకూలంగా ఉంటున్నారన్నారు. మరో వైపు ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారన్నారు. దీంతో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య బంధం అందరికీ అర్థం అయితున్నదరన్నారు.
విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఐటీలు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైనయని బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు. ప్రధాని పర్యటన సందర్భంగా బీఆర్‌ఎస్ వాళ్లను ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? కాంగ్రెస్ వాళ్లనే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
బీజేపీ నేతలు కాళేశ్వరం అవినీతిపై ఎందుకు విచారణ జరిపించట్లేదని అడిగారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఎప్పుడు మొదలు పెడ్తరో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణనను మోడీ అవమానపరుస్తున్నడన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram