Gujarat | మేడ‌పై నిద్ర‌పోదామ‌న్న భార్య‌.. కూతురిని 17 సార్లు పొడిచి చంపిన తండ్రి

Gujarat | ఇంట్లో వేడిగా ఉంది.. మేడ మీద నిద్ర పోదామ‌ని త‌న భ‌ర్త‌ను భార్య అడిగింది. ఆగ్ర‌హావేశాల‌తో ఊగిపోయిన భ‌ర్త‌.. భార్య‌పై ప‌దునైన క‌త్తితో దాడి చేశాడు. అడ్డు వ‌చ్చిన కూతురిపై అదే క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి చంపాడు. కూతురిపై 17 క‌త్తిపోట్లు ప‌డ్డాయి. ఈ దారుణ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని సూర‌త్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన రామానుజ్ మ‌హాదేవ్ సాహు త‌న భార్య రేఖాదేవీ, పిల్ల‌ల‌తో క‌లిసి కొన్నేండ్ల […]

Gujarat | మేడ‌పై నిద్ర‌పోదామ‌న్న భార్య‌.. కూతురిని 17 సార్లు పొడిచి చంపిన తండ్రి

Gujarat | ఇంట్లో వేడిగా ఉంది.. మేడ మీద నిద్ర పోదామ‌ని త‌న భ‌ర్త‌ను భార్య అడిగింది. ఆగ్ర‌హావేశాల‌తో ఊగిపోయిన భ‌ర్త‌.. భార్య‌పై ప‌దునైన క‌త్తితో దాడి చేశాడు. అడ్డు వ‌చ్చిన కూతురిపై అదే క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి చంపాడు. కూతురిపై 17 క‌త్తిపోట్లు ప‌డ్డాయి. ఈ దారుణ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని సూర‌త్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన రామానుజ్ మ‌హాదేవ్ సాహు త‌న భార్య రేఖాదేవీ, పిల్ల‌ల‌తో క‌లిసి కొన్నేండ్ల క్రితం సూర‌త్‌లోని క‌డోద‌ర‌కు వ‌ల‌స వ‌చ్చాడు. స్థానికంగా ఉన్న మిల్లులో మ‌హాదేవ్ ప‌ని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంప‌తుల‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే గురువారం రాత్రి.. ఇంటి మేడ‌పై నిద్రిద్దామ‌ని మ‌హాదేవ్‌ను భార్య కోరింది. దీంతో ఇరువురి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

అనంత‌రం బ‌య‌ట‌కు వెళ్లిన భ‌ర్త‌.. ప‌దునైన క‌త్తితో ఇంటికి తిరిగొచ్చాడు. ఇక రేఖాదేవిపై దాడి చేశాడు. త‌ల్లి ప్రాణాల‌ను కాపాడేందుకు య‌త్నించిన కూతురిపై కూడా 17 సార్లు విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి చంపాడు.

తండ్రి దాడిలో ముగ్గురు కుమారులు సూర‌జ్, ధీర‌జ్, విశాల్ కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని రేఖాదేవీ, పిల్ల‌ల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కూతురు చంద్ కుమారి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.