Viral Video | పామును.. న‌మిలి మింగిన జింక‌

Viral Video విధాత : జింక‌ల‌ను మీరు ఎప్పుడైనా చూశారా..? అవి కేవ‌లం శాఖాహారులు మాత్ర‌మే. ఆకుల‌ను, గ‌డ్డి మొక్క‌ల‌ను తిని జీవిస్తుంటాయి. చూడ‌టానికి కూడా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి జింక‌లు. అయితే ఓ జింక‌కు మాత్రం శాఖాహారం తిని తిని బోర్ వ‌చ్చిన‌ట్టు ఉంది. ఇంకేముందీ ఓ పామును నమిలి మింగింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నంద ఈ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో […]

Viral Video | పామును.. న‌మిలి మింగిన జింక‌

Viral Video

విధాత : జింక‌ల‌ను మీరు ఎప్పుడైనా చూశారా..? అవి కేవ‌లం శాఖాహారులు మాత్ర‌మే. ఆకుల‌ను, గ‌డ్డి మొక్క‌ల‌ను తిని జీవిస్తుంటాయి. చూడ‌టానికి కూడా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి జింక‌లు.

అయితే ఓ జింక‌కు మాత్రం శాఖాహారం తిని తిని బోర్ వ‌చ్చిన‌ట్టు ఉంది. ఇంకేముందీ ఓ పామును నమిలి మింగింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నంద ఈ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే అడ‌విలో ఉన్న ఓ జింక పామును న‌మిలి మింగుతున్న దృశ్యాన్ని ఓ వ్య‌క్తి త‌న మొబైల్‌లో చిత్రీక‌రించి వైర‌ల్ చేసిన‌ట్లు పేర్కొన్నారు.

జింకలు అస‌లు మాంసాన్ని ముట్ట‌వు. కేవ‌లం ఆకులు, గ‌డ్డి మొక్క‌లు తిని జీవించేస్తుంటాయి. కానీ ఈ జింక మాత్రం ఓ పామును క్ష‌ణాల్లో నమిలి మింగింది. ప్ర‌స్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది