Crime News | కోడలికి లైంగిక వేధింపులు.. భర్త గొంతు కోసి చంపిన భార్య
Crime News | ఓ వ్యక్తి తన కోడలిపై కన్నేశాడు. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో అతన్ని గొంతు కోసి చంపింది భార్య. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ పట్టణంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. తాళ్ల వ్యాపారి తేజేంద్రసింగ్, మిథిలేశ్ దేవి దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఆగస్టు 14వ తేదీన తేజేంద్ర సింగ్ అనుమానాస్పదస్థితిలో హత్యకు గురయ్యాడు. సింగ్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిథిలేశ్ […]
Crime News |
ఓ వ్యక్తి తన కోడలిపై కన్నేశాడు. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో అతన్ని గొంతు కోసి చంపింది భార్య. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ పట్టణంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. తాళ్ల వ్యాపారి తేజేంద్రసింగ్, మిథిలేశ్ దేవి దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఆగస్టు 14వ తేదీన తేజేంద్ర సింగ్ అనుమానాస్పదస్థితిలో హత్యకు గురయ్యాడు. సింగ్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మిథిలేశ్ దేవిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. తేజేంద్ర ప్రతి రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. కుమారుడి భార్యను లైంగిక వేధిస్తూ, ఆమెను కొట్టేవాడు. దీంతో చాలా రోజుల నుంచి ఆమె నరకం భరిస్తూ వచ్చింది.
తనతో లైంగిక సంబంధానికి కోడలిని ఒప్పించమని తనను కూడా వేధించాడని దేవి పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన మిథిలేశ్ దేవి.. ఈ నెల 14న మంచంపై పడుకున్న భర్తను చంపేసింది. కొడవలితో గొంతు కోసం చంపినట్లు అంగీకరించింది దేవి.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram