Viral: తాగడానికి.. సిట్టింగ్ రూం పెట్టరా! నడిరోడ్డుపై మందుబాబు హంగామా!

Drink Alcohol On The Road :
మద్యం మత్తులో మందుబాబులు నేరాలే కాదు..విచిత్రమైన వేషాలతో నవ్వు కూడా తెప్పిస్తుంటారు. ఆమధ్య ఓ మందు బాబు కుక్క పిల్లను పశువుల దవాఖానకు కాకుండా మనుషుల దవాఖానకు తీసుకెళ్లి నా పిల్లికి వైద్యం చేయాలంటూ హల్చల్ చేశాడు. అది పిల్లి కాదు.. కుక్క పిల్లరో నాయనా.. దానికి ఇక్కడ వైద్యం చేయరన్నా కూడా వినకుండా నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే.
అలాంటి మరో మందుబాబు విచిత్ర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా నడి రోడ్డుపైన కూర్చొని తాగుతూ నా ఇష్టం ఇక్కడే కూర్చుని తాగుతా అంటూ హల్చల్ చేసిన ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది.
తాగడానికి సిట్టింగ్ రూములు లేవని..అందుకే నా ఇష్టం ఉన్న చోట కూర్చుని తాగుతానంటూ నడిరోడ్డుపై మందు బాటిల్‌తో తిష్టవేసి తన వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. అంతేకాదు.. తాను మళ్లీ వస్తానని.. ఫుల్ బాటిల్ ఇదే ప్లేస్‌లో తాగుతానని.. ఎవరు ఏం చేస్తారో చేయండి అంటూ హంగామా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.