KTR: కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు

Formula E Car Race Case : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 16వ తేదీన సోమవారం ఉదయం 10గంటలకు విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసులలో స్పష్టం చేసింది. ఈ కేసులో జనవరిలో కేటీఆర్ ను విచారించిన ఏసీబీ ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు నిర్వహణ ఒప్పందంలో నేరుగా విదేశీ సంస్థ ఎఫ్ ఈవో కు రూ.45.71కోట్లు చెల్లించి ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఇటు ఏసీబీతో పాటు అటు ఈడీ సైతం కేసులు నమోదు చేశాయి. జనవరి నెలలో కేటీఆర్ తో పాటు నిందితులను దర్యాప్తు సంస్థలు విచారించాయి.
ఫార్ములా ఈ ఆపరేషన్స్ సీఈవో తో పాటు స్పాన్సర్ గ్రీన్ కో అనుబంధ సంస్థ ఎస్ నెక్స్ట్ జెన్ కంపనీ ప్రతినిధులను, ఐఏఎస్ అర్వింద్ కుమార్ ను, హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిను విచారించాయి. తాజాగా ఈ కేసులో కేటీఆర్ ను మరోసారి ఏసీబీకి విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.