విధాత: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి శివారులో బుధవారం ఉదయం లారీ ఢీకొని అశోక్ కుమార్ (25) అనే యువకుడు మృతి చెందాడు. స్కూటీపై రోడ్డు దాటుతున్న క్రమంలో లారీ ఢీ కొట్టింది. ప్రమాదం అనంతరం లారీ ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్‌ను సీసీ ఫుటేజ్ ఆధారంగా వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కెట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్కూటీపై రోడ్డు దాటుతూ.. లారీ టైర్ల కింద పడి వ్యక్తి మృతి! సీసీ కెమెరాలో వీడియో రికార్డ్https://t.co/lKXSIzxJ9F pic.twitter.com/0G344A0i53
— vidhaathanews (@vidhaathanews) February 15, 2023
మరో ఘటనలో
ఇదిలాఉండగా మరో ఘటనలో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం టోల్‌గేట్ వద్ద కొర్లపహాడ్ శివారు హోటల్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి బైక్‌పై వెళుతున్న ప్రేమ్ కుమార్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. హైవే వెంట టోల్ ప్లాజా యజమాన్యం హోటల్ పర్మిషన్ ఇవ్వడం వలనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తు యువకుని మృతదేహంతో టోల్ ప్లాజా కార్యాలయం ఎదుట బంధువులు ధర్నాకు దిగారు. ధీంతో హైవేపై అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయగా ఎస్ఐ అనిల్ రెడ్డి హామీతో కుటుంబీకులు ఆందోళన విరమించారు.