Kapil Sibal అచ్ఛేదిన్ ఇంకెప్పుడు?.. ప్రధాని మోదీకి కపిల్ సిబల్ కౌంటర్
Kapil Sibal పదేళ్లవుతున్నా అవినీతి అంతమేది? న్యూఢిల్లీ: మోదీ అధికారంలోకి వచ్చి పదేళ్లవుతున్నా.. ఆయన చెప్పిన అచ్ఛేదిన్ ఇంకా ఎందుకు రాలేదని, అవినీతి ఎందుకు అంతం కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఆగస్ట్ 15న ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించిన సిబల్.. ‘ప్రధాని ఆగస్ట్ 15న: అవినీతిని పెకళించి వేయాలని మీరు చెప్పారు. మరి మీరు దాదాపు పదేళ్లుగా పరిపాలిస్తున్నారు. ఏం జరిగింది? అచ్ఛేదిన్ ఎక్కడ? మర్చిపోయారా? ద్రవ్యోల్బణం తగ్గుమఖం పట్టిందన్నారు. […]
Kapil Sibal
పదేళ్లవుతున్నా అవినీతి అంతమేది?
న్యూఢిల్లీ: మోదీ అధికారంలోకి వచ్చి పదేళ్లవుతున్నా.. ఆయన చెప్పిన అచ్ఛేదిన్ ఇంకా ఎందుకు రాలేదని, అవినీతి ఎందుకు అంతం కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు.
ఆగస్ట్ 15న ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించిన సిబల్.. ‘ప్రధాని ఆగస్ట్ 15న: అవినీతిని పెకళించి వేయాలని మీరు చెప్పారు. మరి మీరు దాదాపు పదేళ్లుగా పరిపాలిస్తున్నారు. ఏం జరిగింది? అచ్ఛేదిన్ ఎక్కడ? మర్చిపోయారా? ద్రవ్యోల్బణం తగ్గుమఖం పట్టిందన్నారు.
కానీ.. కూరగాయల ధరలు తగ్గలేదు. రాబోయే ఐదేళ్లు స్వర్ణయుగం అన్నారు. ఎవరికి స్వర్ణయుగం? పేదలకా? దళితులకా? మైనార్టీలకా?’ అని ఎక్స్ పోస్టింగ్‌లో నిలదీశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram