Manobala | సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హస్య నటుడు మనోబాల కన్నుమూత

Manobala విధాత: ప్రముఖ తమిళ హస్యనటుడు, దర్శకుడు మనోబాల(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆయన పక్షం రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి ఈ రోజు (బుధవారం) మరణించారు. பிரபல இயக்குநரும், நடிகருமான, அருமை நண்பர் மனோபாலாவுடைய இறப்பு எனக்கு மிகவும் வேதனை அளிக்கிறது. அவருடைய குடும்பத்தினருக்கு என்னுடைய அனுதாபங்கள். அவரது ஆத்மா சாந்தியடையட்டும்.@manobalam — Rajinikanth (@rajinikanth) May 3, 2023 1953లో […]

  • By: krs    latest    May 03, 2023 12:24 PM IST
Manobala | సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హస్య నటుడు మనోబాల కన్నుమూత

Manobala

విధాత: ప్రముఖ తమిళ హస్యనటుడు, దర్శకుడు మనోబాల(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆయన పక్షం రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి ఈ రోజు (బుధవారం) మరణించారు.

1953లో జన్మించిన ఆయన 1970లో సిని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి భారతీరాజా వద్ద సహాకుడిగా పని చేసి 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. అంతేగాక 3 సినిమాలు నిర్మించారు. 350కి పైగా సినిమాల్లో నటించారు.

తెలుగులో ఆయన మహనటి, రాజ్‌దూత్‌, వాల్తేరు వీరయ్య వంటి తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులో మనోబాల నటించిన చివరి చిత్రం వాల్తేరు వీరయ్య.