Actress |
గాయత్రి గుప్తా ..ఈమె పేరు తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. నటిగా, టీవీ ప్రజెంటర్‌గా అలరించింది. అయితే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఇష్యూ గురించి తెలుగు న్యూస్ ఛానల్స్ లో చర్చలలో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఎప్పుడు ఏం మాట్లాడిన కూడా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్‌గా నటించింది గాయత్రి.
ఈ సినిమా తర్వాత ఆమె కొబ్బరి మట్ట, ఐస్ క్రీమ్, రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ , బుర్రకథ, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. గాయత్రి గుప్తా తెలంగాణ రాష్టంలోని సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట అనే ఊరులో జన్మించగా, ఆమె తల్లి తండ్రులు చాలా కాలం క్రితమే విడాకులు తీసుకుని విడిపోయి ఎవరి దారులు వారు చూసుకున్నారు.
గాయత్రి గుప్తా కొంత కాలంగా సైలెంట్ గా ఉంటూ వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణం గురించి, వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొస్తూ.. తన హెల్త్ కండీషన్ క్రిటికల్ ఉందని.. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్ననంటూ చెప్పి పెద్ద బాంబ్ పేల్చింది.
ఇప్పుడు తన ఆరోగ్యం మెరుగుపరచుకునేందుకు విరాళాలు సేకరించాలనుకుంటున్నాని.. అలాగే తన తండ్రిని ఎప్పుడు ఫాదర్ గా భావించలేదంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. గాయత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. గతంలో ఈ అమ్మడు తన ప్రియుడు తనను మోసం చేశాడంటూ కూడా పలు ఆరోపణలు చేసిన విషయం విదితమే.
అప్పట్లో గాయత్రి గుప్తా బిగ్ బాస్ షో గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ సరిగా లేదని, వారు చేసే ప్రామిసెస్ కరెక్టుగా లేవంటూ సంచలన ఆరోపణలు చేసింది. అగ్రిమెంట్ బాండ్ మీద సంతకం చేసిన రెండు నెలల తర్వాత మీరు లేరని డిక్లేర్ చేయడం వల్ల నేను ఆల్రెడీ కమిటైన ఆరు ప్రాజెక్టులు పోగొట్టుకున్నానంటూ గాయత్రి స్పష్టం చేసింది.
దానికి పరిహారం అడిగితే వారు పరిహారం కూడా ఇవ్వలేదని గాయత్రి పేర్కొంది. ఒకానొక సమయంలో గాయత్రి ఎన్నో బాధలు పడిందట.ఎన్నో రోజులు ఆకలితో ఉన్నాను. నేను మంచి దాన్ని కాదేమో అన్న భ్రమతో డిప్రెషన్‌లోకి కూడా వెళ్లానంటూ గాయత్రి తెలియజేసింది.