Actress Jamuna | అలనాటి అందాల నటి జమున కన్నుమూత
Actress Jamuna | సినీయర్ నటి జమున(86) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున హైదరాబాద్‌లోని తన స్వగృహంలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. జమున మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్‌కు జమున పార్థీవ దేహాన్ని తీసుకురానున్నారు. 1953లో పుట్టిల్లు సినిమాతో ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తెరంగ్రేటం చేసింది. సత్యభామ పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. […]

Actress Jamuna | సినీయర్ నటి జమున(86) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున హైదరాబాద్‌లోని తన స్వగృహంలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. జమున మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్‌కు జమున పార్థీవ దేహాన్ని తీసుకురానున్నారు.
1953లో పుట్టిల్లు సినిమాతో ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తెరంగ్రేటం చేసింది. సత్యభామ పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మిస్సమ్మ సినిమా జమున సినీ కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో జమున నటించారు. 1936, ఆగస్టు 30న హంపీలో జన్మించారు.
తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.
ప్రొఫెసర్ జూలురి రమణారావును జమున వివాహం చేసుకున్నారు. వీరికి వంశీ, స్రవంతి అనే ఇద్దరు సంతానం ఉన్నారు. వంశీ మీడియా ప్రొఫెసర్‌గా శాన్‌ఫ్రాన్సిస్కో లో పని చేస్తున్నారు. కుమార్తె స్రవంతితో కలిసి హైదరాబాద్‌లోనే జమున నివసిస్తున్నారు. జమున భర్త 2014 నవంబరు 10లో గుండెపోటుతో మరణించారు.