Plane Crash: విమానం తోక‌భాగంలో మృతదేహం.. ఎవరిది?

Plane Crash: విమానం తోక‌భాగంలో మృతదేహం.. ఎవరిది?

Plane Crash: ఎయిరిండియా ప్రమాద ఘటనకు సంబంధించిన రెస్క్యూ కొనసాగుతున్నది. కాగా సహాయక చర్యలు జరుగుతుండగా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విమానం తోక భాగంలో మృతదేహం ఉన్నట్టు బయటపడింది. ఈ మృతదేహం విమానంలోని సిబ్బందిది కావొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్నది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన విమానం టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాలకు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది మాత్రమే కాకుండా.. విమానం ఓ మెడికల్ కళాశాల హాస్టల్ మీద పడటంతో వారు కూడా మృతి చెందారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.