Nizamabad | ధరల పెరుగుదలపై ఐద్వా మహిళల నిరసన
Nizamabad విధాత ప్రతినిధి, నిజామాబాద్: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తు, ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తు జిల్లా ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని, వారి జీవనం కష్టతరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు […]
Nizamabad
విధాత ప్రతినిధి, నిజామాబాద్: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తు, ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తు జిల్లా ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని, వారి జీవనం కష్టతరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు జీఎస్టీ వసూళ్లపై పెడుతున్న శ్రద్ధ ధరల నియంత్రణపై పెట్టడం లేదని ఆరోపించారు. ధరల తగ్గుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలు, పేదలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram