తెలుపు దుస్తుల్లో.. గుండీలు విప్పేసి ఐశ్వ‌ర్య‌ లక్ష్మి రచ్చ..!

  • By: sn    latest    Sep 24, 2023 3:58 AM IST
తెలుపు దుస్తుల్లో.. గుండీలు విప్పేసి ఐశ్వ‌ర్య‌ లక్ష్మి రచ్చ..!

మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైన అందాల న‌టి ఐశ్వర్య ల‌క్ష్మి. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్స్‌తో దూసుకుపోతుంది. తాజాగా మ‌ట్టి కుస్తీ అనే సినిమాలో న‌టించ‌గా, ప్ర‌స్తుతం ఈ సినిమా థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తుంది. ‘నందుకలుడే నట్టిల్ ఒరిడవేల’ అనే మలయాళం చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. గాడ్సే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్క‌డి అభిమానుల మ‌న‌సులు కూడా గెలుచుకుంది. అమ్ము వెబ్ సిరీస్, పొన్నియన్ సెల్వన్ చిత్రాలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ అందాల ముద్దుగుమ్మ న‌టిగానే కాకుండా నిర్మాత‌గా కూడా మారి గార్గి వంటి కంటెంట్ ఓరియెంట్ సినిమాలు రూపొందించింది.

ఇప్పుడు మలయాళంలో దుల్కర్ తో కలిసి కింగ్ ఆఫ్ కోత సినిమా చేస్తుంది. ఎంబీబీఎస్ చ‌దివిన ఐశ్వర్య లక్ష్మీ తాను డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయిన‌ట్టు ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చింది. సినిమా రంగంపై త‌న త‌ల్లిదండ్రుల‌కి నెగెటివ్ అభిప్రాయం ఉండేద‌ని, స‌మాజంలో కొంద‌రు త‌ప్పుగా చిత్రీక‌రించే వారని, యాక్టింగ్‌ని వారు గౌర‌వ‌ప్ర‌ద‌మైన కెరీర్‌గా చూసేవారు కాద‌ని పేర్కొంది. సినిమా పరిశ్రమలో కొనసాగడం అంత సులభం కాదు, ప్రతి రోజూ పోరాటం చేయాల్సి వస్తుందని ఐశ్వ‌ర్య పేర్కొంది. ఇక ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త అందాలు ఆవిష్క‌రిస్తూ కేక పెట్టిస్తుంది.

ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ కవ్వించే అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది. తాజాగా వైట్ క‌ల‌ర్ డ్రెస్‌లో అందాల ర‌చ్చ‌కి తెర లేపుతూ కేక పెట్టించింది ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ. వైట్ డ్రెస్‌లో ఈ అమ్మ‌డు ఏంజెల్ మాదిరిగా క‌నిపించి అభిమానుల‌కి మంచి ఫీస్ట్ అందించింది. ప్ర‌స్తుతం ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే ఐశ్వ‌ర్య ఓ ఇంట‌ర్వ్యూలో తాను చిన్న‌ప్పుడు లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. “చిన్నప్పుడు కేరళలోని గురువాయూర్ ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక కుర్రాడు నా ప్రైవేట్ పార్ట్స్ ని తాకిన‌ట్టు పేర్కొంది. ఇప్ప‌టికీ ప్ర‌మోష‌న్స్ కోసం ఇత‌ర ప్ర‌దేశాల‌కి వెళ్లిన‌ప్పుడు అలాంటి సంఘ‌ట‌న‌లు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంద‌ని ఐశ్వ‌ర్య తెలియ‌జేసింది.