Aishwarya Rajesh | ఛామనచాయలో ఉన్నావ్‌.. జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనికిరావ్‌ అన్నారు..! ఆవేదన వ్యక్తం చేసిన ఐశ్వర్య రాజేశ్‌..!

Aishwarya Rajesh | ఐశ్వర్య రాజేశ్‌ కెరీర్‌ టీవీ షోలో యాంకర్‌గా పని చేసింది. ఆ తర్వాత బిగ్‌ స్క్రీన్‌పై కనిపించింది. 2011లో ‘అవర్గలుం వీరిగళం’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2012లో వచ్చిన ‘అట్టకత్తి’ సినిమా విమర్శలకు ప్రశంసలు అందుకున్నది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నది. ఐశ్వర్య రాజేశ్‌ ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ పలుచిత్రాల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ ప్రశంసలు పొందుతున్నది. అయితే, కెరీర్ తొలి […]

Aishwarya Rajesh | ఛామనచాయలో ఉన్నావ్‌.. జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనికిరావ్‌ అన్నారు..! ఆవేదన వ్యక్తం చేసిన ఐశ్వర్య రాజేశ్‌..!

Aishwarya Rajesh |

ఐశ్వర్య రాజేశ్‌ కెరీర్‌ టీవీ షోలో యాంకర్‌గా పని చేసింది. ఆ తర్వాత బిగ్‌ స్క్రీన్‌పై కనిపించింది. 2011లో ‘అవర్గలుం వీరిగళం’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2012లో వచ్చిన ‘అట్టకత్తి’ సినిమా విమర్శలకు ప్రశంసలు అందుకున్నది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నది.

ఐశ్వర్య రాజేశ్‌ ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ పలుచిత్రాల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ ప్రశంసలు పొందుతున్నది. అయితే, కెరీర్ తొలి నాళ్లలో తాను ఎదుర్కొన్న కష్టాలను ఐశ్వర్య రాజేశ్‌ వివరించింది. కెరీర్‌ ప్రారంభంలో సినిమా పరిశ్రమలో కొందరు వ్యక్తులు తనను అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

చామన ఛాయలో ఉన్నావని, కనీసం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా పనికి రావని అన్నారని తెలిపింది. ఇండస్ట్రీలో లింగ అసమానతలపై నిర్వహించిన సమావేశంలో ఐశ్వర్య మాట్లాడింది. ‘నాకు ఎలాంటి బ్యాక్‍గ్రౌండ్ లేదు. నా తండ్రి సినిమాల్లో పని చేశారు. కానీ, నాకు ఎనిమిదేళ్ల వయస్సున్నప్పుడు ఆయనను కోల్పోయాను. నా శరీర రంగు చామన ఛాయగా ఉందని చాలా మంది అనేవారు.

యాక్టర్ కాదు కదా.. జూనియర్ యాక్టర్‌కు కూడా సరిపోవని అన్నారు. నేను సాధారణంగా తమిళంలోనే మాట్లాడతాను. అది ఓ సమస్యగా మారింది. హీరోయిన్లు ఎలా ఉండాలని అందరూ అనుకుంటారో నేను అలా పెరగలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే, తాను ఎదుర్కొన్న వివక్షనే తనను మరింత బలంగా చేసిందని, లక్ష్యం వైపు ముందుకు సాగేలా చేసిందని తెలిపింది.

తాను ఎక్కువగా మహిళా ప్రాధాన్యమున్న సినిమాలే చేస్తున్నందున స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం ఆగిపోయాయని పేర్కొంది. ‘ఎందుకు మహిళా ప్రాధాన్యమున్న సినిమాలే చేస్తున్నారని హైదరాబాద్‍లో నన్ను ఓ జర్నలిస్ట్ అడిగారు. అయితే, హీరో సెంట్రిక్ సినిమాలే ఎందుకు చేస్తారని మీరు స్టార్‌ హీరోలని అడగగలరా? అని నేను ఎదురు ప్రశ్నించా అంటూ గుర్తు చేసింది.

ఐశ్వర్య రాజేశ్‌ ఎక్కువగా ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ సినిమాల్లో చేస్తున్నది. ఇటీవల ‘ఫర్హానా’ చిత్రంలో కనిపించింది. ఇందులో ముస్లిం కుటుంబానికి చెందిన యువతిగా కనిపించింది. థియేటర్లలో మిశ్రమ స్పందన రాగా.. సోనీ లివ్‌ ఓటీటీలోకి ఫర్హానా మూవీ స్ట్రీమింగ్‌ అవుతున్నది.