సీనియర్ నటుడు దివంగత తమిళ హీరో మురళి చిన్న కుమారుడు, ప్రస్తుత యంగ్ హీరో ఆధర్వ మురళి తమ్ముడు ఆకాశ్ మురళి (Akash Murali) హీరోగా ఆరంగేట్రం చేస్తున్న చిత్రం ప్రేమిస్తావా (Premistava). పేరున్న దర్శకుడు విష్ణు వర్ధన్ (Vishnu Vardhan)ఈ సినిమాకు దర్శకత్వం వహించగా శరత్ కుమార్, దగ్గుబాటి రాజా కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి (Aditi Shankar) కథానాయికగా నటించింది. ఇప్పుడీ చిత్రం తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. https://www.youtube.com/watch?v=NQe37Wi2jRU