Khushbu Sundar | జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి ఖుష్బు రాజీనామా
ప్రముఖ నటి, బీజేపీ ముఖ్యనేత ఖుష్బు సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేసింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు

విధాత, హైదరాబాద్ : ప్రముఖ నటి, బీజేపీ ముఖ్యనేత ఖుష్బు సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేసింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు. జూన్ 28 నుంచి అమలులోకి వచ్చే ఆమె రాజీనామాను ఆమోదించినట్లు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేందుకే ఆమె రాజీనామా చేసినట్లు వెల్లడించింది. ఖుష్బు సడెన్ గా తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయాల్లో 14 ఏళ్లుగా అంకిత భావంతో పనిచేస్తున్నానని,. ఇన్ని సంవత్సరాల తర్వాత నా మనసు మార్పును సూచిస్తోందని ఖుష్బు తన ట్వీట్‌లో పేర్కోంది. బీజేపీకి పూర్తిగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే జాతీయ మహిళా కమిషన్ కు రాజీనామా చేశానని తెలిపింది. ఇక ఇన్ని రోజులు మహిళా కమిషన్ లో పనిచేసేందుకు అవకాశం కల్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ లకు ధన్యవాదాలని పేర్కొంది. జాతీయ మహిళా కమిషన్‌లో తన సేవలకు కొన్ని పరిమితులు ఉండటంతో, ఇప్పుడు రాజీనామా తర్వాత తనను తాను పూర్తిగా బీజేపీ మిషన్‌కు అంకితం చేసుకునే వీలు కలుగుతుందని ఆమె తన పోస్టులో వెల్లడించారు. తాను ఇప్పుడు హృదయపూర్వకంగా సేవ చేయడానికి స్వేచ్ఛను కలిగి ఉన్నట్లు చెప్పారు. క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో చెన్నైలోని బీజేపీ కార్యాలయం ‘కమలాలయం’లో జరిగే జెండా కార్యక్రమానికి హాజరుకానున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్న బీజేపీకి ఖష్పూ సుందర్ ప్రముఖ నాయకురాలిగా ఉన్నారు. కాగా ఖుష్బు నిర్ణయాన్ని ఆమె మద్దతుదారులు స్వాగతించారు.