Allu Arjun-Trivikram | ఐకానిక్ కాంబినేషన్‌లో నాలుగో చిత్రం.. ఈసారి మరింత పెద్దగా.. అంటే?
Allu Arjun-Trivikram విధాత: ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకుని ఐకానిక్ కాంబినేషన్‌గా పేరొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో.. ఇప్పుడు 4వ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న ‘పుష్ప 2’ తర్వాత, అలాగే త్రివిక్రమ్ చేస్తున్న మహేష్ బాబు సినిమా తర్వాత.. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత.. త్రివిక్రమ్ […]

Allu Arjun-Trivikram
విధాత: ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకుని ఐకానిక్ కాంబినేషన్‌గా పేరొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో.. ఇప్పుడు 4వ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న ‘పుష్ప 2’ తర్వాత, అలాగే త్రివిక్రమ్ చేస్తున్న మహేష్ బాబు సినిమా తర్వాత.. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత.. త్రివిక్రమ్ తన తదుపరి సినిమాకు దాదాపు 2 సంవత్సరాలు టైమ్ తీసుకున్నారు.
ఇప్పుడు మహేష్‌తో చేసే చిత్రంపై కూడా అనేకానేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్, త్రివిక్రమ్ కాంబో సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా చేశారు కానీ.. మధ్యలో చాలా మార్పులు చోటు చేసుకోవడంతో.. మళ్లీ మొదటి నుంచి షూటింగ్ మొదలెట్టనున్నారనేలా టాక్ నడుస్తుంది. దీంతో ఈ సినిమా అసలు ఉంటుందా? అనేలా కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
సరే ఆ విషయం పక్కన పెడితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోయే సినిమా విషయానికి వస్తే.. ఇప్పటి వరకు వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు కూడా ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా ఘన విజయం సాధించాయి. మూడో సినిమా ‘అల వైకుంఠపురములో’ అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రజాదరణ పొందింది.
గురు పూర్ణిమ శుభ సందర్భంగా, వీరి కలయికలో రాబోతోన్న నాలుగో సినిమా ప్రకటనని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈసారి ఈ కలయికలో రాబోయే సినిమా మరింత పెద్దగా ఉంటుందనేలా.. విడుదల చేసిన వీడియోలో ప్రకటించారు. తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమా సిద్ధమవుతుందనేలా ప్రకటనలో తెలిపారు.
సినిమా హారిక & హాసిని క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.8గా తెరకెక్కబోతోంది. ఇంతకు ముందు అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన మూడు సినిమాలనూ హారిక & హాసిని క్రియేషన్స్ సంస్థే నిర్మించింది. ఇప్పుడీ నాలుగో సినిమాని మరింత భారీస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుందట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరినీ సంతృప్తి పరచడానికి అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు.
హారిక & హాసిని క్రియేషన్స్‌తో కలిసి ‘అల వైకుంఠపురములో’ చిత్ర నిర్మాణంలో భాగమైన గీతా ఆర్ట్స్ సంస్థ.. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణంలోనూ భాగం అవుతుంది. ఈ చిత్రాన్ని పద్మశ్రీ అల్లు రామలింగయ్య మరియు శ్రీమతి మమత సమర్పణలో హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు.