Viral | అంబులెన్స్ డ్రైవ‌ర్, రోగి దారి మ‌ధ్య‌లోనే మందేశారు..!

Viral Video | బాధ్య‌త‌గా ప్ర‌వ‌ర్తించాల్సిన ఓ అంబులెన్స్ డ్రైవ‌ర్.. త‌న విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. కాలు విరిగి బాధ‌ప‌డుతున్న రోగికి మ‌ద్యం తాగించి, తాను సేవించాడు డ్రైవ‌ర్. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని జ‌గ‌త్‌సింగ్‌పూర్ జిల్లాలో సోమ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఓ వ్య‌క్తి చెట్టుపై నుంచి జారిప‌డ‌టంతో కాలికి తీవ్ర గాయ‌మైంది. దీంతో ఓ ప్ర‌యివేటు అంబులెన్స్‌కు ఫోన్ చేయ‌గా, అది హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుంది. గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని అంబులెన్స్‌లో ఎక్కించుకుని […]

  • Publish Date - December 21, 2022 / 06:08 AM IST

Viral Video | బాధ్య‌త‌గా ప్ర‌వ‌ర్తించాల్సిన ఓ అంబులెన్స్ డ్రైవ‌ర్.. త‌న విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. కాలు విరిగి బాధ‌ప‌డుతున్న రోగికి మ‌ద్యం తాగించి, తాను సేవించాడు డ్రైవ‌ర్. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని జ‌గ‌త్‌సింగ్‌పూర్ జిల్లాలో సోమ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

ఓ వ్య‌క్తి చెట్టుపై నుంచి జారిప‌డ‌టంతో కాలికి తీవ్ర గాయ‌మైంది. దీంతో ఓ ప్ర‌యివేటు అంబులెన్స్‌కు ఫోన్ చేయ‌గా, అది హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుంది. గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని అంబులెన్స్‌లో ఎక్కించుకుని జ‌గ‌త్‌సింగ్‌పూర్‌కు బ‌య‌ల్దేరాడు డ్రైవ‌ర్. అయితే క‌ట‌క్ – ప్యార‌డైజ్ రోడ్డులోని ఓ వైన్ షాపు వ‌ద్ద డ్రైవ‌ర్ అంబులెన్స్‌ను ఆపాడు. అక్క‌డ మ‌ద్యం కొనుగోలు చేశాడు. అంద‌రూ చూస్తుండ‌గానే, రోగికి మ‌ద్యం ఇచ్చాడు. రోగి ఓ రెండు పెగ్గులు, డ్రైవ‌ర్ రెండు పెగ్గులు వేశారు.

ఈ వ్య‌వ‌హారాన్ని స్థానికులు త‌మ కెమెరాల్లో చిత్రీక‌రించి, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. రోగికి మ‌ద్యం ఇవ్వ‌డం, మీరు మ‌ద్యం సేవించి, వాహ‌నం న‌డ‌ప‌డం నేరం క‌దా? అని స్థానికులు డ్రైవ‌ర్‌ను నిల‌దీశారు. హ‌స్పిట‌ల్‌కు చేరుకునే లోపు మ‌ద్యం కావాల‌ని రోగి అడిగాడు. దీంతో అత‌నికి మ‌ద్యం తాగించాన‌ని డ్రైవ‌ర్ పేర్కొన్నాడు. మొత్తంగా అంబులెన్స్ డ్రైవ‌ర్ తీవ్ర విమర్శ‌ల‌కు గుర‌వుతున్నాడు. మ‌ద్యం సేవించి, డ్రైవింగ్ చేసిన డ్రైవ‌ర్‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు పేర్కొన్నారు.