Pune | పుణెలో పోలీస్ అధికారి దుశ్చర్య.. భార్య, మేనల్లుడిని కాల్చి ఏసీపీ ఆత్మహత్య
Pune భార్య, మేనల్లుడి కాల్చిచంపి ఆత్మహత్య విధాత: మహారాష్ట్రలోని పుణెలో దారుణం చోటు చేసుకున్నది. ఒక పోలీస్ అధికారి తన భార్య, మేనల్లుడిని కాల్చిచంపాడు. తర్వాత తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. అమరావతిలోని రాజాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏపీసీ)గా పనిచేస్తున్న భరత్ గైక్వాడ్ (57) కుటుంబం ఫుణెలోని బనేర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నది. వారాంతంలో కుటుంబంతో గడిపేందుకు వచ్చిన ఏసీపీ ఆదివారం […]

Pune
- భార్య, మేనల్లుడి కాల్చిచంపి ఆత్మహత్య
విధాత: మహారాష్ట్రలోని పుణెలో దారుణం చోటు చేసుకున్నది. ఒక పోలీస్ అధికారి తన భార్య, మేనల్లుడిని కాల్చిచంపాడు. తర్వాత తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది.
అమరావతిలోని రాజాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏపీసీ)గా పనిచేస్తున్న భరత్ గైక్వాడ్ (57) కుటుంబం ఫుణెలోని బనేర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నది. వారాంతంలో కుటుంబంతో గడిపేందుకు వచ్చిన ఏసీపీ ఆదివారం రాత్రి 3.30 గంటల ప్రాంతంలో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.
‘తొలుత భార్య మోని గైక్వాడ్ (44)ను తలపై కాల్చాడు. తుపాకీ కాల్పుల శబ్దానికి నిద్రలేచిన ఏసీపీ కుమారుడు, మేనల్లుడు దీపక్ (35) పరుగున వచ్చి డోర్ తెరిచి చూశారు. అనంతరం దీపక్‌ను కూడా చెస్ట్‌పై కాల్చారు.
అనంతరం ఏసీసీ భరత్ గైక్వాడ్ కూడా తలపై కాల్చుకున్నాడు. ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో ఏసీపీ ఈ దుర్చశ్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన వెనుక గల కారణాలు తెలియరాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీస్ అధికారులు తెలిపారు.