Ananya Nagalla అనన్య నాగళ్లని వచ్చిన కొత్తలో.. అంతా అవమానించారు. ఈ భామ అసలు హీరోయిన్ మెటీరీయల్ కానే కాదనేలా కామెంట్స్ చేశారు. అయినా సరే చిన్నాచితకా అవకాశాలు ఆమెను వరిస్తూనే వచ్చాయి. ఇప్పుడిప్పుడే ఈ భామ ఇండస్ట్రీ వారి కళ్లలో పడుతోంది. అందుకు ఆమె కూడా బాగానే ట్రై చేస్తోంది. ఆ విషయం ఆమెని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి బాగా తెలుస్తుంది. కెరీర్ ప్రారంభంలో పద్ధతిగా, చిన్న పిల్లలా కనిపించిన అనన్య.. ఇప్పుడు […]
అనన్య నాగళ్లని వచ్చిన కొత్తలో.. అంతా అవమానించారు. ఈ భామ అసలు హీరోయిన్ మెటీరీయల్ కానే కాదనేలా కామెంట్స్ చేశారు. అయినా సరే చిన్నాచితకా అవకాశాలు ఆమెను వరిస్తూనే వచ్చాయి. ఇప్పుడిప్పుడే ఈ భామ ఇండస్ట్రీ వారి కళ్లలో పడుతోంది. అందుకు ఆమె కూడా బాగానే ట్రై చేస్తోంది. ఆ విషయం ఆమెని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి బాగా తెలుస్తుంది.
కెరీర్ ప్రారంభంలో పద్ధతిగా, చిన్న పిల్లలా కనిపించిన అనన్య.. ఇప్పుడు ‘అరుంధతి’ సినిమాలో రెండో అనుష్కను సోనూసూద్ చూసినప్పుడు అతను చెప్పే డైలాగ్స్‌లా తయారైంది. నేను హీరోయిన్ మెటీరీయలే అన్నట్లుగా సోషల్ మీడియాలో తన అందాల పదునుతో కుర్రకారు గుండెల్ని కోసేస్తోంది.
తాజాగా ఆమె తడిసిన అందాలతో.. నడుము మరియు నాభి కనిపించేలా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. కొంటె చూపులతో.. తడిసిన తెల్ల చీరలో.. చూపించాల్సినవి చూపిస్తూ.. హోయలోలిస్తున్న అనన్య ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ‘వకీల్‌సాబ్’ సినిమాతో కాస్త పేరు తెచ్చుకున్న ఈ భామ.. ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు తెగ తాపత్రయ పడుతోంది.
అందుకోసం గ్లామర్ ప్రదర్శననే నమ్ముకుంది. రీసెంట్గా వచ్చిన శాకుంతలం చిత్రంలో కూడా అనన్య మంచి గ్లామర్ పాత్రలో కనిపించింది. ఇప్పుడా పాత్రకు కంటిన్యూ అన్నట్లుగా తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు ఉన్నాయి. ఇక ఈ ఫొటోలు చూసిన తర్వాత నెటిజన్లు రియాక్షన్ చూస్తే.. అందానికి సంబంధించి ఓ బుక్‌ని ప్రింట్ వేయవచ్చు.
* ఓరి నాయనో.. ఏంటి ఆ అందం.. అన్నం బదులు రోజూ అందం తింటూ బ్రతికేస్తున్నారా కొంపతీసి..
* అప్సరసలు ఇలాగే ఉండే వాళ్లు అనుకుంటా..
* నీ నడుము, నాభి డైరెక్ట్‌గా చూసి చనిపోవచ్చు
* సమ్మర్ హీట్‌లో అల్లాడుతుంటే.. మళ్లీ నీ హీట్ ఒకటి మధ్యలో..
* చంపేస్తారా.. చంపేస్తారా మమ్మలని.. ఏంటి అలా చూస్తున్నారు
* నీలో ఏదో తెలియని మాయ ఉంది.. నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది
ఇవి నెటిజన్ల రియాక్షన్స్. ఇవే కాదండోయ్ ఇంకా లోతుగానే కామెంట్స్ చేస్తున్నారు. వాటిని ఇక్కడ రాయలేం కాబట్టి.. మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే.. మీరూ ఈ ఫొటోలపై ఓ లుక్ వేసుకోండి.