విధాత: ఈటీవీలో మల్లెమాల సంస్థ మొదలుపెట్టిన జబర్దస్త్ షో ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికీ తెలుసు. ఎందరో కొత్త నటీనటులకు కమెడియన్లకు యాంకర్లకు ఈ షో బాగా పాపులారిటీని తీసుకొని వచ్చింది. దీని ద్వారానే సుడిగాలి సుదీర్ నుంచి గెటప్ శీను వరకు ఎందరో సినీ ఎంట్రీ ఇచ్చారు.
వీరందరి కంటే ముందు అనసూయ భరద్వాజను పేర్కొనాలి. ఈ షోకు ముందు అనసూయ అంటే ఎవరికీ తెలియదు. ఏదో చిత్రాలలో హీరోయిన్ల పక్క గుంపులో గోవిందలా చిన్నచిన్న పాత్రలతో నెట్టుకొచ్చింది. అలాంటి ఈమెకు జబర్దస్త్ షో స్టార్ హోదాను కట్టబెట్టింది.
అందులోనూ మొహమాటం లేకుండా స్కిన్ షో చేయడంలోనూ గ్లామర్ వలకబోయడంలోనూ వెనుకాడక పోవడంతో హాట్ యాంకర్‌గా ఈమె అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యింది. మధ్యలో కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల జబర్దస్త్ కు దూరంగా జరిగింది.
ఆ సమయంలో దానిలోనికి ప్రవేశించిన రేష్మి గౌతమ్ సైతం మంచి పేరునే సాధించింది. ఇక ఎక్స్‌ట్రా జబర్దస్త్ సమయంలో అనసూయ మరోసారి చేసింది. బోల్డ్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయకు ఆపై సినిమా అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ఏకంగా ఈమె ప్రధాన పాత్రలో చిత్రాలు కూడా వచ్చాయి. మరోవైపు వెబ్ సిస్‌లతో చాలా బిజీగా ఉంది. దీంతో జబర్దస్త్ షోని వదిలేస్తున్నట్టు ప్రకటించింది. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ చంటి, రాఘవ వెళ్లిపోవద్దని బతిమలాడారు.
ఎవరు చెప్పినా అనసూయ వినలేదు. షో నుంచి బయటకు వచ్చాక ఆమె కొన్ని కారణాలు తెలియజేశారు. రెండేళ్లుగా జబర్దస్త్ వదిలేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అగ్రిమెంట్ ముగియడంతో ఇప్పుడు బయటకు వచ్చేసానని చెప్పింది. ఈ క్రమంలో అనసూయ ఒక ఆరోపణ కూడా చేసింది. ఇందులోని స్కిట్స్‌లో కమెడియన్లు బాడీ షేమింగ్ కి పాల్పడేవారు. వారి కామెంట్స్ సెటైర్స్, మనసును బాధించేవి. అయితే అది కారణం కాదు. నా కొడుకుల కోసమే నేను జబర్దస్త్ మానేశాను.
తమకు సమయం కేటాయించాలని నా ఇద్దరు కొడుకులు కోరారు. పిల్లల కంటే సంపాదన ఎక్కువ కాదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మల్లెమాల వారు రెమ్యూనరేషన్ పెంచుతామని చెప్పినా నేను వెనక్కి తగ్గలేదు అని చెప్పుకొచ్చిందని సమాచారం.
అయితే బుల్లితెరపై కంటే వెండితెర పైన నటిస్తేనే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వస్తాయని అంతేకాక వెబ్ సిరీస్‌లో నటిస్తే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారిని ఆకట్టుకోవచ్చని తద్వారా బుల్లితెరపై కంటే ఎక్కువ పాపులారిటీ రెమ్యూనరేషన్ వస్తాయనేది ఆమె ఉద్దేశంగా పలువురు చెబుతున్నారు.