Betting Apps | పోలీసుల విచారణకు సహకరిస్తా: యాంకర్ శ్యామల
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ప్రముఖ యాంకర్, నటి, వైసీసీ నేత శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో యాంకర్ శ్యామల కోర్టు నుంచి అరెస్టు కాకుండా ఊరట పొందారు.

Betting Apps: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ప్రముఖ యాంకర్, నటి, వైసీసీ నేత శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో యాంకర్ శ్యామల కోర్టు నుంచి అరెస్టు కాకుండా ఊరట పొందారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ కేసులను కొట్టివేయాలంటూ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసం శ్యామలను అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
శ్యామల కూడా విచారణకు సహకరించాలని ఆదేశించింది. సోమవారం నుండి పోలీసుల ఎదుట హాజరుకావాలని పేర్కొంది. పోలీసులు ఈ కేసులో నోటీసు ఇచ్చి విచారణ కొనసాగించవచ్చు అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శ్యామల సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియ, రీతు చౌదరిలను కూడా విచారించి వారి స్టెట్మెంట్ కూడా రికార్డు చేశారు.
విచారణకు సహకరిస్తా: శ్యామల
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పూర్తిగా తప్పని.. దీంతో నష్టపోయిన కుటుంబాలకు ఏర్పడిన లోటు ఎవరి తీర్చలేనిదని నటి శ్యామల స్పష్టం చేశారు. పంజాగుట్ట పోలీసుల విచారణ హాజరైన అనంతరం ఆమె మాట్లాడారు. ప్రస్తుతం కేసు పురోగతిలో ఉందని.. కోర్టు పరిధికి వెళ్లిందని.. ఈ పరిస్థితులో తాను ఏం మాట్లాడలేనని చెప్పారు. పోలీసుల విచారణకు సహకరిస్తున్నానని.. నిందితులను పట్టుకోవడానికి పోలీసులకు నా వంతుగా సహకరిస్తాని స్పష్టం చేశారు. చట్టం, న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉందన్నారు.