ADANI | అదానీ కంపెనీకి మరో షాక్‌.. డెలాయిట్ ఆడిటర్ రాజీనామా

ADANI | హిండన్‌ బర్గ్‌ రిపోర్టే కారణమంటున్న నిపుణులు విధాత ప్రతినిధి: దేశ ఆర్ధిక రంగంలో కీలక పాత్ర నిర్వహిస్తున్న అదానీ సంస్థ గురించి తెలిసిందే. అయితే ఈ కంపెనీ ఏడాది నుంచి దేశ ఆర్ధిక రంగాన్నే కాకుండా రాజకీయ రంగాన్నికూడా బాగా ప్రభావితం చేస్తున్నది. ఈ క్రమంలో దేశ మీడియాలోనే కాకుండా, పార్లమెంట్ లో కూడా ఈమధ్య బాగానే చర్చల్లోకి ఎక్కింది. అందుకు కారణం అదానీ ప్రధాని మోది కి అత్యంత సన్నిహితుడని తెలిసిందే. ఈ […]

  • Publish Date - August 13, 2023 / 01:42 PM IST

ADANI |

హిండన్‌ బర్గ్‌ రిపోర్టే కారణమంటున్న నిపుణులు

విధాత ప్రతినిధి: దేశ ఆర్ధిక రంగంలో కీలక పాత్ర నిర్వహిస్తున్న అదానీ సంస్థ గురించి తెలిసిందే. అయితే ఈ కంపెనీ ఏడాది నుంచి దేశ ఆర్ధిక రంగాన్నే కాకుండా రాజకీయ రంగాన్నికూడా బాగా ప్రభావితం చేస్తున్నది. ఈ క్రమంలో దేశ మీడియాలోనే కాకుండా, పార్లమెంట్ లో కూడా ఈమధ్య బాగానే చర్చల్లోకి ఎక్కింది. అందుకు కారణం అదానీ ప్రధాని మోది కి అత్యంత సన్నిహితుడని తెలిసిందే.

ఈ కంపెనీ అకౌంట్స్‌కు సేవలందిస్తున్న ఆడిట్‌ కంపెనీ డెలాయిట్‌ హాస్కిన్స్ అండ్ సేల్స్ తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. ఉన్నపలంగా తమ సేవలను అదాని గ్రూప్‌కు నిలిపి వేస్తూ రాజీనామా చేసింది. అయితే అదానీ కంపెనీ పై గతం లో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ రిసెర్చ్ ఒక నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం అదానీ కంపెనీ అక్రమంగా లాభాలను పొందుతున్నట్లు ఆరోపణ చేసింది.

ఈ నివేదిక దేశంలో పెద్ద సంచలం సృష్టించింది. గల్లీనుండి ఢిల్లీ దాకా తీవ్ర దుమారం లేపింది. తాజాగా డెలాయిట్ రాజీనామా కూడా ఈ హిండెన్ బర్గ్ నివేదిక లోభాగమే నని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. హిండెన్ బర్గ్ రిసెర్చ్ నివేదిక తర్వాత గ్రూపులోని ఇతర సంస్థలపై అడిటర్ విస్తృత అంశాలు కోరుకొంటున్నట్లు కంపెనీ తెలిపింది.

నివేదికలోప్రధానంగావెల్లడించిన కొన్నిలావా దేవీలపై డెలాయిట్ ఆందోళనవ్యక్తం చేసింది. కాగా కొన్ని వారాల్లోనే రాజీనామా చేయడం గమనార్హం. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకానమిక్ జోన్స్( APSEZ)లో డెలాయిట్ 2017 మే నుండి తన సేవలను ప్రారంభించింది. 5సంవత్సరాల అనంతరం 2022 జులై లో తిరిగి డెలాయిట్ సేవలను పొడిగించారు.

అయితే గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ పోర్ట్స్ వ్యాపారానికి ఆడిటర్ గా వ్యవహరిస్తున్న డెలాయిట్ రాజీనామా వల్ల అదానీ కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బని చెప్పకోవచ్చు. బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార రంగంలో భారీ మార్పులు, నిఘాలు ముమ్మరం చేసింది.

అయితే ఈ మధ్య కాలంలో అదాని కంపెనీ తమ సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే డెలాయిట్‌ రాజీనామా ఈ కంపెనీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. డెలాయిట్‌ రాజీనామా తరువాత అదానీ పోర్ట్స్‌ నూతన ఆడిటర్‌గా ఎం.ఎస్‌.కే.ఏ అండ్‌ అసోసియేట్స్‌ గ్రూప్‌ను తమ ఆడిటర్స్‌ గా నియమించారు.