AP Cabinet | పీఆర్సీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

కొత్త డీఏ అమలు.. సీపీఎస్‌ రద్దు కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్థీకరణ 6840 కొత్త పోస్టుల మంజూరు ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు విధాత‌: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్థీకరించాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నిర్ణయించింది. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం(AP Cabinet).. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. అమ్మ ఒడి పథకం, 6,840 కొత్త పోస్టుల మంజూరుతో పాటు ప‌లు కీల‌క నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలివే ఈ ఏడాది అమ్మ […]

  • Publish Date - June 7, 2023 / 12:18 PM IST
  • కొత్త డీఏ అమలు.. సీపీఎస్‌ రద్దు
  • కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్థీకరణ
  • 6840 కొత్త పోస్టుల మంజూరు
  • ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు

విధాత‌: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్థీకరించాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నిర్ణయించింది. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం(AP Cabinet).. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. అమ్మ ఒడి పథకం, 6,840 కొత్త పోస్టుల మంజూరుతో పాటు ప‌లు కీల‌క నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

కేబినెట్ నిర్ణయాలివే

  • ఈ ఏడాది అమ్మ ఒడి పథకం అమలు, విద్యా కానుక పంపిణీకి కేబినెట్ ఆమోదం
  • వివిధ ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న.. 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ఆమోదం
  • గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఎంఓయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం
  • ఏపీ గ్యారెంటీడ్ పెన్ష‌న్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్ష‌న్ విధానానికి ఆమోదం
  • కొత్త డీఏ అమలు.. సీపీఎస్ రద్దు
  • 12వ పీఆర్‌సీ అమలుకు కేబినెట్ ఆమోదం
  • 6,840 కొత్త పోస్టుల మంజూరు.. ఇందులో పోలీస్ బెటాలియన్ 3,920 కేబినెట్ ఆమోదం
  • కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 సహా మరి కొన్ని శాఖల్లో పోస్టులు
  • బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ ఉద్యోగులకు ఆమోదం
  • కో -ఆపరేటివ్ సొసైటీల్లో సూపర్ న్యూమరీ పోస్టుకు ఆమోదం
  • అగ్రి కల్చర్‌ మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ ఈఈ పోస్టును ఈఈగా అప్ గ్రేడ్
  • కడప మానసిక వైద్య శాలలో 116 పోస్టులకు కేబినెట్ ఆమోదం
  • సీతానగరం పీహెచ్‌సీ అప్‌ గ్రేడ్‌కు 23 పోస్టులకు ఆమోదం
  • పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ డయాలసిస్ యూనిట్‌కు 41 మెడికల్ ఆఫీసర్లకు ఆమోదం
  • 476 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్‌మెన్ పోస్టులకు ఆమోదం