Penguins | పెంగ్విన్‌ల ప్రాణాలు తీస్తున్న అక్రమ చేపల వేట
Penguins పది రోజుల్లో 2 వేల మంచుపక్షుల మృత్యువాత తూర్పు ఉరుగ్వే తీరానికి కొట్టుకొచ్చిన కళేబరాలు అత్యధికం చిన్న వయసున్న పక్షులే! విధాత: ప్రకృతి తన నియమాల ఆధారంగా నడిస్తే.. అన్నీ సవ్యంగా సాగిపోతాయి. కానీ.. ఒక్కో విపరీత చర్య.. కొన్ని రకాల వినాశాలకు దారి తీస్తుంది. దీనికి పసిఫిక్ మహాసముద్రంలో మృత్యువాత పడుతున్న మంచు పెంగ్విన్ పక్షులే నిదర్శనం! పసిఫిక్ మహాసముద్రంలో మితిమీరిన చేపల వేట, అక్రమ ఫిషింగ్ పెంగ్విన్‌ల ప్రాణాలు తీస్తున్నాయి! బ్రసీలియా: పసిఫక్ […]

Penguins
- పది రోజుల్లో 2 వేల మంచుపక్షుల మృత్యువాత
- తూర్పు ఉరుగ్వే తీరానికి కొట్టుకొచ్చిన కళేబరాలు
- అత్యధికం చిన్న వయసున్న పక్షులే!
విధాత: ప్రకృతి తన నియమాల ఆధారంగా నడిస్తే.. అన్నీ సవ్యంగా సాగిపోతాయి. కానీ.. ఒక్కో విపరీత చర్య.. కొన్ని రకాల వినాశాలకు దారి తీస్తుంది. దీనికి పసిఫిక్ మహాసముద్రంలో మృత్యువాత పడుతున్న మంచు పెంగ్విన్ పక్షులే నిదర్శనం! పసిఫిక్ మహాసముద్రంలో మితిమీరిన చేపల వేట, అక్రమ ఫిషింగ్ పెంగ్విన్‌ల ప్రాణాలు తీస్తున్నాయి!
బ్రసీలియా: పసిఫక్ మహాసముద్రంలో గడిచిన పది రోజులలో 2 వేల పెంగ్విన్ పక్షులు మృత్యువాత పడ్డాయి. వాటి కళేబరాలు ఉరుగ్వే తూర్పు తీరానికి కొట్టుకువచ్చాయి. వియన్ ఇన్‌ఫ్లూయెంజాగా ప్రాథమికంగా తొలుత అంచనాకు వచ్చినప్పటికీ.. మరణాలకు కారణం ఇతమిద్ధంగా తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. చనిపోయినవాటిలో 90శాతం పిల్లలేనని సమాచారం. వాటిని కెరటాలు ఉరుగ్వే తూర్పు తీరానికి తీసుకొచ్చాయని దేశ పర్యవారణ శాఖలోని జీవజాతుల విభాగం అధిపతి కార్‌మెన్‌లెయిజా గొయెన్ చెప్పారు.
‘జలాల్లో మరణాలవి. కొట్టుకు వచ్చిన పక్షుల్లో 90 శాతం చిన్నపిల్లలే. వాటి శరీరాల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు లేవు. ఖాళీ కడుపులతో ఉన్నాయి’ అని ఆమె తెలిపారు. వాటి నుంచి నమూనాలు తీసుకుని పరిశీలించగా.. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా నెగెటివ్ వచ్చిందని చెప్పారు. మంచు పెంగ్విన్‌లు అర్జెంటీనా దక్షిణ ప్రాంతంలో అత్యధికంగా ఉంటాయి. దక్షిణార్థగోళ శీతాకాలంలో అవి ఆహారం, ఉష్ణజలాల కోసం ఉత్తరాదికి వలసపోతాయి.
ఈ క్రమంలో ఒక్కోసారి అవి బ్రజిల్‌లోని ఎస్పిరిటో శాంటో రాష్ట్రానికి కూడా చేరుతాయి. కొంత మొత్తం వరకు ఇటువంటి మరణాలు సాధారణమేనని, కానీ.. ఇంత పెద్ద సంఖ్యలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నదని కార్‌మెన్ లెయిజాగొయెన్ చెప్పారు. ఇటువంటి పరిస్థితే గత ఏడాది బ్రెజిల్‌లో ఏర్పడిందని ఆమె గుర్తు చేశారు.
ఎందుకు చనిపోతున్నాయంటే..
పెంగ్విన్‌ల మరణాలకు మితిమీరిన చేపల వేటతోపాటు.. అక్రమ చేపల వేట కూడా కారణమని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు. 1990 నుంచి 2000 సంవత్సరం మధ్య అనేక జీవజాతులు ఆహారం లేక చనిపోయిన ఉదంతాలు మనం చూశాం. వాటి ఆహార వనరులు మితిమీరిన దోపిడీకి గురవుతున్నాయి’ అని ఎస్వోఎస్ మెరైన్ వైల్డ్‌లైఫ్ రెస్యూ అనే ఎన్జీవోకు చెందిన రిచర్డ్ టెసోర్ చెప్పారు. అట్లాంటిక్ మహాసముద్రంలో జూలై నెల మధ్యలో సంభవించిన ఉష్ణమండల తుఫానుతో బ్రెజిల్ నైరుతి ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది.
దీని కారణంగా ఏర్పడిన అననుకూల వాతావరణ పరిస్థితుల్లో బలహీనమైన జంతుజాలం మృత్యువాత పడి ఉండొచ్చని ఆయన చెప్పారు. మాంటేవిడియో రాజధాని తూర్పు ప్రాంతమైన మాల్డొనాడో బీచ్‌లలోకి పెట్రెల్, అల్బెట్రోస్, సీగల్, సముద్రపు తాబేళ్లు, సముద్రపు సింహాలు వంటివి చనిపోయి కనిపించాయని తెలిపారు. తగిన ఆహారం లభించక ఇవి మృత్యువాత పడి ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.