Kejriwal | మా పోరాటం అంతా.. మొత్తం దేశం కోసం: అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal విధాత: మాపోరాటం ఢిల్లీ కోసం మాత్రమే కాదని మొత్తం దేశం కోసమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సుదీర్ఘంగా ఈ విషయాన్ని చర్చించామని తెలిపారు. తాము చేసే ఈ పోరాటం రాజ్యాంగ పరిరక్షణ కోసమన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఉన్నప్పుడు అధికారాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉన్నాయని తెలిపారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే మోడీ ప్రభుత్వం అధికారాలను తీసివేసిందన్నారు. […]

  • Publish Date - May 27, 2023 / 12:05 PM IST

Arvind Kejriwal

విధాత: మాపోరాటం ఢిల్లీ కోసం మాత్రమే కాదని మొత్తం దేశం కోసమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సుదీర్ఘంగా ఈ విషయాన్ని చర్చించామని తెలిపారు. తాము చేసే ఈ పోరాటం రాజ్యాంగ పరిరక్షణ కోసమన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఉన్నప్పుడు అధికారాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉన్నాయని తెలిపారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే మోడీ ప్రభుత్వం అధికారాలను తీసివేసిందన్నారు.

తాము 8 ఏళ్ళు ఢిల్లీ ప్రజల కోసం పోరాటం చేసామని, సుప్రీంకోర్టులో 8 ఏళ్ల తరువాత న్యాయం జరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టులో న్యాయం జరిగినా.. దానిని కాదని కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలే అమలు చేయకపోతే దేశ ప్రజలు ఎక్కడి వెళ్లి చెప్పుకోవాలని కేజ్రీ అడిగారు. మోడీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను ఛాలెంజ్ చేస్తున్నారన్నారు.

బీజేపీ యేతర ప్రభుత్వం ఉన్న ఏ రాష్ట్రాన్ని కేంద్రం పాలన చేసుకోనివడం లేదన్నారు. ఇడి(ED), సీబీఐ(CBI)లను పంపి బెదిరించి ఎమ్మెల్యేలను కొంటారు, ప్రభుత్వాలను కూల్చుతారన్నారు. నేను దేశ ప్రజలకు కోసం దేశమంతా తిరుగుతానని తెలిపారు.

రాజ్యసభలో ఈ ఆర్డినెన్స్ ను అడ్డుకోవాలని బీజేపీ యోతర పార్టీలను కోరుతున్నానని కేజ్రీవాల్ తెలిపారు. ఆర్డినెన్స్ ను అడ్డుకోని మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుదామన్నారు.

దేశ ప్రజల హక్కుల కోసం పోరాటం: పంజాబ్ సీఎం

దేశ ప్రజల హక్కుల కోసం తాము పోరాటం చేస్తున్నామని పంజాబ్ సీఎం మాన్ సింగ్ అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నడిచేందుకు గవర్నర్ సహకరించలేదని, దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో గవర్నర్ బడ్జెట్ సమావేశాల్లో నా ప్రభుత్వం అని చదువుతూ ప్రారంభించారన్నారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ నిలిపివేశారన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ఇండియా అని ఒకే పువ్వు ఉండటం కుదరదన్నారు. దేశం ఒక పూల మాల లాంటిదని, ఆ మాలలో అన్ని రకాల పూలు ఉంటాయన్నారు.

Latest News