Komatireddy Rajagopal Reddy : యువత ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయం
యువత ప్రభుత్వం కూల్చడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు. నిరుద్యోగుల సమస్యపై ప్రభుత్వంపై దాడి.

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విధాత): కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం గన్ పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. నేపాల్ తరహాలో యువత మన ప్రభుత్వంపై తిరగబడటం ఖాయమన్నారు. నిరుద్యోగులత్ పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాధించలేదని అన్నారు. నిరుద్యోగులను గాలికి వదిలేయవద్దని, వారికి దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని హెచ్చారించారు. కాగా కొంతకాలంగా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇన్ని జరుగుతున్నా రాజగోపాల్ రెడ్డిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కాంగ్రెస్ వర్గాలు తప్పుబడుతున్నాయి.