Assembly | విద్యా, వైద్య రంగాల సమస్యలపై భట్టి దాడి.. తిప్పికొట్టిన మంత్రి హరీశ్‌రావు

Assembly అడ్డు తగిలిన అధికార పార్టీ సభ్యులు విధాత: విద్యా, వైద్య రంగాల సమస్యపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల చర్చలో ప్రభుత్వంపై మాటల దాడి చేశారు. అధికార పార్టీ సభ్యులు, మంత్రులు భట్టి ప్రసంగానికి పదేపదే అడ్డుతగలగా, మంత్రి టి.హరీశ్‌రావు భట్టి ఆరోపణలకు సమాధానమిస్తు 60ఏళ్ల కాంగ్రెస్‌, టీడీపీ పాలనల కంటే తొమ్మిదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ విద్యా, వైద్య రంగాల పదింతలు అభివృద్ది సాధించాయన్నారు. తెలంగాణలో జరుగుతున్న […]

  • Publish Date - August 4, 2023 / 01:03 AM IST

Assembly

  • అడ్డు తగిలిన అధికార పార్టీ సభ్యులు

విధాత: విద్యా, వైద్య రంగాల సమస్యపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల చర్చలో ప్రభుత్వంపై మాటల దాడి చేశారు. అధికార పార్టీ సభ్యులు, మంత్రులు భట్టి ప్రసంగానికి పదేపదే అడ్డుతగలగా, మంత్రి టి.హరీశ్‌రావు భట్టి ఆరోపణలకు సమాధానమిస్తు 60ఏళ్ల కాంగ్రెస్‌, టీడీపీ పాలనల కంటే తొమ్మిదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ విద్యా, వైద్య రంగాల పదింతలు అభివృద్ది సాధించాయన్నారు.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పక్క రాష్ట్రం రజనీకాంత్ వారికి కనిపిస్తున్నా ఇక్కడి కాంగ్రెస్ గజనీలకు కనిపించకపోవడం శోచనీయమన్నారు. భట్టి తన ప్రసంగంలో పాఠశాలలో పని చేస్తున్న స్వీపర్లకు నెలకు 2500 రూపాయల వేతనం మాత్రమే ఇచ్చి శ్రమదోపిడి చేయడం సరికాదని వారికి కనీస వేతనం అమలు చేసి రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలో 7లక్షల మంది చదువుతున్న గురుకుల విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో దాదాపుగా 700 గురుకుల పాఠశాలలకు భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్యన విద్యార్థలు తరగతి గదిలోనే చదువుతూ.. తరగతి గదిలోనే తింటూ.. తరగతి గదిలోనే నిద్రపోతున్నారు. ఇదేనా తెలంగాణ సాధించిన అభివ్రుద్ది అని సర్కార్ ను ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నప్పటికీ ఎందుకు గురుకులాలకు భవనాలు నిర్మించడంలేదని సర్కార్ ను నిలదీశారు. 2013లో వేసిన డీఎస్సీ తప్పా ఇప్పటి వరకు టీచర్ల రిక్రూట్ మెంట్ చేయకపోవడం తగదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20వేల టీచర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్టం వచ్చిన తరువాత రాష్ట్రంలో కార్పేరేట్, ప్రయివేటు పాఠశాలల ఫీజుల దోపిడి ఉండదని, నారాయణ, చైతన్య విద్య సంస్థల దోపిడిని అరికడుతామని ప్రగల్భాలు పలికిన బీఆరెస్‌ పాలకులు తొమ్మదిన్నర సంవత్సరాలు ఎన్ని విద్యాసంస్థల్లో ఫీజలు దోపిడిని అరికట్టారని నిలదీశారు. నారాయణ, చైతన్య లాంటి కార్పోరేట్ విద్య సంస్థలు అనుమతులు లేకుండా పాఠశాలలు నడుపుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

కార్పోరేట్ విద్యాసంస్థలు విద్యను మాఫీయాగా మార్చాయని ద్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ విద్యా సంస్థలకు రెండు, మూడుకు మించి పాఠశాలలు ఉండొద్దని ఆదిశగా చర్యలు తీసుకొంటే చదువుకొని స్వయం ఉపాధి పొందాలనుకున్న నిరుద్యోగులు గ్రామాల్లో బడులు పెట్టుకొని బతుకుతారన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచన చేయాలన్నారు.

నారాయణ, చైతన్య కార్పోరేట్ పాఠశాలల్లో పెరుగుతున్న వేదింపుల వల్ల విద్యార్థలు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్ధితి ఉందన్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలని బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
నేను పాదయాత్ర చేస్తున్న క్రమంలో వర్దన్నపేట నియోజకవర్గం మడికొండ గ్రామంలో గీత కార్మికుడు బైరి నాగన్న గౌడ్ అనే కార్మికుడు ఎదురొచ్చి మాకు ఉచితంగా ఏది ఇవ్వాల్సిన అవసరం లేదని, ఉచితంగా విద్య, వైద్యం అందించాలని కోనినట్లుగా చెప్పారు.

పార్లమెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్టును తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయడం వల్ల పేదలు లబ్ధి పొందుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏండ్లు కావస్తున్న ఇప్పటి వరకు ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క యూనివర్శీటిని ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం చేసింది కూడా యూనివర్సిటీ విద్యార్థులేనని, మరీ వీరి పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎందుకు యూనివర్సిటీల్లో ఆచార్యుల నియామకం చేయకుండ నిర్వీర్యం చేస్తున్నదని ద్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలో 2825 ఆద్యాపక పోస్టులకు గాను 873 మంది మాత్రమే పని చేస్తున్నారని 1952 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీసీలు, రిజిష్టర్స్ లేకుండా యూనివర్సిటీల నిర్వహణ ఎలా సాధ్యమన్నారు.

ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తూ బార్లలాగా తెరిచితే బడుగు బలహీన వర్గాలు ఉన్నత చదవులు ఏలా చదువుకుంటారని సర్కార్ ను నిలదీశారు. ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చేప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలన్న నిబంధన పేర్కొనకపోవడం దారుణమన్నారు.

ప్రయివేటు యూనివర్సిటీలకు వేల సీట్లు అనుమతి ఇచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలకు వందల సీట్లకు మాత్రమే అనుమతి ఇవ్వడం ఇదేమి వివక్ష. ప్రభుత్వ యూనివర్సిటీల్లో పేదలు చదువుకోవడం మీకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. ప్రయివేటు యూనివర్సిటీల్లో ఉద్యోగాలు వచ్చేటువంటి కోర్సులు ప్రవేశపెట్టి లక్షల ఫీజులు దండుకుంటుండగా.. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఉద్యోగాలు వచ్చేటువంటి కోర్సులు ఎందుకు పెట్టడంలేదని నిలదీశారు.

మీరు ఇలా చేస్తే బడుగు, బలహీన ,దళిత, గిరిజన వర్గాలు ఎలా అభివృద్ధి చెందుతాయని ప్రశ్నించారు. యూనివర్సిటీ విద్యలో దేశంలో తెలంగాణ రాష్ర్టం కింద నుంచి 6వ స్థానంలో ఉందని కేంద్రం ఇచ్చిన నివేదికలో ఉందని సభలో చూపించారు. ప్రయివేటు మెడికల్ కలశాలలు ఫీజుల దోపిడి చేయడానికి అనుగుణంగా ఇచ్చిన జీవోపై ప్రభుత్వం పునః సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ర్టంలో ఫీజు రియెంబర్స్ మెంట్ విడుదల చేయకపోవడం వల్ల కళశాలల యజమాన్యాలు విధ్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం వల్ల ఉన్నత చదువులకు వెళ్లలేక అర్ధాంతరంగా చదువులను ఆపేస్తున్న దుస్తితి నెలకొన్నదన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య, సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.

వైద్య పోస్టులు భర్తీ చేయకుండ మెరుగైన వైద్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటే ఏట్లా? అన్నారు. వరద తాకిడితో మునిగిన ఇల్లు, ఆగ్ని ప్రమాదానికి గురై ఇల్లు కాలిపోతే ఎట్లా ఉంటుందో కార్పోరేట్, ప్రయివేటు ఆసుప్రతులకు వైద్యానికి వెళ్లిన పేద, సామాన్యుల పరిస్థితి అట్లనే ఉందన్నారు. కార్పోరేట్, ప్రయివేటు ఆసుపత్రుల దోపిడి మాఫీయాను మించిపోయిందన్నారు. వెంటనే దోపిడి అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హెరిటేజ్ బిల్డింగ్లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి పక్కన ఖాళీ స్థలం ఉన్నప్పటికి కొత్త భవనాలు ఎందుకు నిర్మించలేదన్నారు. హైదరాబాద్ చుట్టూ టిమ్స్ తరహాలో కార్పేరేట్ వైద్యం అందించే విధంగా 5 ఆసుపత్రుల నిర్మాణం చేస్తామని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. పాలకులకు కావాల్సిన నిర్మాణాలు మాత్రం త్వరగా కట్టుకుంటారు కానీ పేదలకు ఉపయోగపడేటువంటి ఆసుపత్రుల నిర్మాణం చేయడానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అంటు నిలదీశారు.

సభలో ప్రతిపక్ష సభ్యులు చెప్పిన విషయాలను మంత్రి హరీశ్‌రావు తప్పుగా చూపించే ప్రయత్నం చేయడం మాని లోపాలను సరిదిద్దుకుంటే ప్రజలకు మంచి చేసినవారవుతారన్నారు. మనఊరు మన బడి పథకం కింద రాష్ట్రంలో 26వేల బడులకు గాను మొదటి విడతలో 9వేలు ఎంపిక చేసి ఏడాది కాలంలో కేవలం వెయ్యి బడులు మాత్రమే ప్రభుత్వం బాగు చేసిందన్నారు. మిగత బడులు బాగు చేయడానికి ఈ ప్రభుత్వానికి దశబ్ధాలే పడుతుందని ఎద్దేవా చేశారు.

Latest News