Attack On Woman: దారుణం..మహిళను వివస్త్రను చేసి దాడి

విధాత : వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా హింసించిన అమానవీయ ఘటన హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయలలో చోటుచేసుకుంది. ములుగుకు చెందిన రాజుకు చిక్కుడు గంగ అనే మహిళతో వివాహమైంది. అయితే కొన్ని నెలలుగా రాజు మరో వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ వ్యవహారంపై రాజు భార్య గంగ గ్రామ పెద్దలకు ఫిర్యాదైంది. అయినా వారు మారకపోవడంతో గంగ కుటుంబ సభ్యులు ఆ మహిళతో పాటు ఆమె భర్తపై దాడి చేశారు. బాధిత మహిళను చెట్టుకు కట్టైశారు.
వివస్త్రను చేసి మర్మావయాలపై జీడి కూడా పోసినట్లుగా సమాచారం. త్రీవంగా గాయపడిన బాధిత మహిళ అనంతరం ఆ గ్రామం నుంచి వెళ్లిపోయింది. ఆలస్యంగా సమాచారం అందుకున్న ధర్మసాగర్ పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన గంగ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.