విధాత: ఇప్పటికే కిడ్నాప్, తప్పుడు పత్రాలతో లే అవుట్లు వేసి భూములు అమ్మేసిన కేసులు, ప్రత్యర్థుల మీద దాడులు చేసిన కేసులు నెత్తిమీద ఉన్నా సరిపోని ఆళ్లగడ్డ టీడీపీ ఇంచార్జ్ భూమా అఖిల ప్రియ (Akhil Priya) మరో తగాదాను నెత్తికి ఎత్తుకున్నారు. తన తండ్రి దివంగత భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన ఏవి సుబ్బా రెడ్డి మీద అఖిల ప్రియ వర్గం వాళ్ళు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
నిన్న రాత్రి లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన సుబ్బా రెడ్డి మీద ఒక్కసారిగా అఖిల వర్గం దాడి చేసి రక్తగాయాలు అయ్యేలా కొట్టింది. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా ఆస్పత్రికి తరలించారు.
యువగళం పాదయాత్ర 101వ రోజులో భాగంగా నంద్యాల-ఆత్మకూరు రోడ్డులో లోకేశ్ యాత్ర సాగుతుండగా ఒక్కసారిగా ఏవీ సుబ్బారెడ్డి, ఆయన అనుచరులపై అఖిలప్రియ, ఆమె భర్త భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి భౌతికదాడికి తెగబడ్డారు.
కొంత కాలంగా ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ వర్గాల మధ్య పోరు సాగుతోంది. భూమా నాగిరెడ్డికి ఏవీ అత్యంత సన్నిహితుడు. నాగిరెడ్డి కి సంబంధించిన వ్యవహారాలన్నీ ఏవీ చక్కబెట్టేవారు. నంద్యాలలో ఏవికి విస్తృత పరిచయాలు ఉన్నాయి. అయితే నాగిరెడ్డి మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులతో ఏవీకి విభేదాలొచ్చాయి.
అంతే కాకుండా.. గతంలో సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు అఖిలప్రియ దంపతులు పథకం పన్నినట్లు కూడా కేసు నమోదై ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు టికెట్ ఇచ్చేదిలేదని అధిష్టానం భావిస్తోంది.అదే టికెట్ సుబ్బారెడ్డికి ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్లు గ్రహించిన అఖిల ఓర్వలేక ఇలా ఒక్కసారిగా దాడికి తెగబడినట్లు భావిస్తున్నారు.