Nizamabad | అట్టహాసంగా.. నుడా చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం

Nizamabad | విధాత ప్రతినిధి, నిజామాబాద్: నుడా చైర్మన్ గా ఈగ సంజీవరెడ్డి గురువారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కేంద్రంలోని నుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగాల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు బీఆర్ఎస్ నాయకులు బోర్గం గ్రామం నుంచి నుడా కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టపాసులు పేలుస్తూ.. మిఠాయిలు పంచుకుంటూ సంబురంగా […]

  • Publish Date - August 24, 2023 / 12:39 AM IST

Nizamabad |

విధాత ప్రతినిధి, నిజామాబాద్: నుడా చైర్మన్ గా ఈగ సంజీవరెడ్డి గురువారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కేంద్రంలోని నుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగాల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.

అంతకు ముందు బీఆర్ఎస్ నాయకులు బోర్గం గ్రామం నుంచి నుడా కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టపాసులు పేలుస్తూ.. మిఠాయిలు పంచుకుంటూ సంబురంగా నుడా చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నుడా చైర్మన్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

నుడా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐసీడీసీఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు