అయోధ్య గర్భగుడి ఫోటోలు విడుదల
అయోధ్య రామజన్మభూమిలో నిర్మిస్తున్న నూతన ఆలయం గర్భగుడి ఫోటోలను విడుదల చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర చంపత్ రాయ్ ఈ పోటోలను విడుదల చేశారు

విధాత : అయోధ్య రామజన్మభూమిలో నిర్మిస్తున్న నూతన ఆలయం గర్భగుడి ఫోటోలను విడుదల చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర చంపత్ రాయ్ ఈ పోటోలను విడుదల చేశారు. గర్భగుడిలో ప్రతిష్టించనున్న బాల రాముడి మూల విరాట్ ప్రతిష్టాపన చేసే పీట స్థానం కూడా ఈ ఫోటోలో కనిపిస్తుంది. కాగా గర్భగుడిలో ప్రతిష్టించడానికి కమలం పీఠంపై ఉండే బాల రాముడి రూపాలతో వేర్వేరు చోట్ల మూడు విగ్రహాలను సిద్ధం చేస్తున్నారు. వాటిలో సుందరమైన ఒక విగ్రహాన్ని ఎంపిక చేసి గర్భగుడిలో ప్రతిష్టిస్తారు.
प्रभु श्री रामलला का गर्भ गृह स्थान लगभग तैयार है। हाल ही में लाइटिंग-फिटिंग का कार्य भी पूर्ण कर लिया गया है। आपके साथ कुछ छायाचित्र साझा कर रहा हूँ। pic.twitter.com/yX56Z2uCyx
— Champat Rai (@ChampatRaiVHP) December 9, 2023
అయోధ్యలో జనవరి 16నుంచి ఆలయ ప్రతిష్టాపన పూజలు ఆరంభమవుతాయి. 17న జల యాత్ర, 18నుంచి ప్రధాన పూజలు నిర్వహిస్తారు. 20న వాస్తు పూజ, ఆలయ సంప్రోక్షణ, 21న విగ్రహాలకు జలాభిషేకం, ఊరేగింపు, శయ్యాధివాస్, తత్వన్యాస్, మహాన్యాస్ తదితర పూజలు నిర్వహిస్తారు. 22న ప్రధానమైన విగ్రహాలకు దేవ ప్రాణ ప్రతిష్ట పూజ నిర్వహించిన మహాపూజ, హారతి, పూర్ణాహుతి నిర్వహిస్తారు.