Bala Krishna | అంద‌రి ముందే.. రామ్‌కి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య‌! మాట్లాడు అంటూ ఫుల్ సీరియ‌స్

Bala Krishna | యంగ్ హీరో రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ స్కంద‌. బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో రామ్ స‌ర‌స‌న , శ్రీలీల, సాయీ మంజ్రేకర్‌ హీరోహీరోయిన్లుగా న‌టించారు. `స్కంద` చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించ‌గా, చిత్రాన్ని సెప్టెంబర్‌ 15న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ క్ర‌మంలో శ‌నివారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక శిల్ప‌క‌ళా వేదిక‌లో నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కి బాలయ్య […]

  • By: sn    latest    Aug 27, 2023 6:25 AM IST
Bala Krishna | అంద‌రి ముందే.. రామ్‌కి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య‌! మాట్లాడు అంటూ ఫుల్ సీరియ‌స్

Bala Krishna |

యంగ్ హీరో రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ స్కంద‌. బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో రామ్ స‌ర‌స‌న , శ్రీలీల, సాయీ మంజ్రేకర్‌ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ‘స్కంద’ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించ‌గా, చిత్రాన్ని సెప్టెంబర్‌ 15న రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఈ క్ర‌మంలో శ‌నివారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక శిల్ప‌క‌ళా వేదిక‌లో నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కి బాలయ్య గెస్ట్‌గా రావ‌డంతో కార్య‌క్ర‌మం చాలా సంద‌డిగా సాగింది. రామ్ మాట్లాడుతూ.. బాల‌య్య‌ని తెగ పొగిడేశాడు.పాత తరం, ఇప్పటితరం, కొత్తతరం వాళ్లతో కూడా డాన్సులు వేయిస్తూ.. మూడు తరాలను అలరించే ఏకైక హీరో బాలయ్య అంటూ ప్ర‌శంసలు కురిపించాడు.

అవార్డులు, రివార్డులు కాదు, ఇలాంటి క్రేజ్ ప్ర‌తి ఒక్క న‌టుడికి ఉండాలని రామ్ చెప్పుకొచ్చారు. పెద్ద వాళ్లని, యూత్‌ని, అమ్మాయిలను, అబ్బాయిలను, మాస్‌, క్లాస్ తేడా లేకుండా అందరు జై బాలయ్య అంటున్నార‌ని అది బాల‌య్య క్రేజ్ అని రామ్ చెప్పుకొచ్చాడు. ఇక త‌న‌కి బాల‌య్య‌కి మ‌ధ్య జ‌రిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు.

‘స్కంద’ ఈవెంట్‌కి గెస్ట్ గా బాలయ్య బాబాయ్‌ వస్తున్నారని తెలిసి పద్ధతిగా వెళ్లి క‌లుద్దామ‌ని ఫోన్ చేస్తే, మనకు అలాంటి పద్ధతులేం లేవుగా అని బాల‌య్య అన్నార‌ని రామ్ చెప్పుకొచ్చాడు. అయితే స్పీచ్ మ‌ధ్య‌లో..రామ్‌కి బాలయ్య స‌ర‌దాగాగ వార్నింగ్‌ ఇవ్వడం గమనార్హం.

వినకూడనివి వింటే మామూలుగా ఉండదంటూ హెచ్చరించిన బాల‌గ‌య్య‌… నాగ‌కు కొన్ని వినిపిస్తున్నాయంటూ హిందీలో డైల‌గ్‌తో అద‌ర‌గొట్టాడు. అర‌చేయి చూపిస్తూ.. మాట్లాడు అంటూ తనదైన స్టయిల్‌లో వార్నింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు బాలయ్య. వారి మధ్య స్టేజ్‌పై కాసేపు సరదా సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇక బాల‌య్య మాట్లాడుతూ..రామ్‌ని త‌మ్ముడు అని సంబోధిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తెలంగాణ యాస, భాషలో ‘ఇస్మార్ట్ శంకర్’ తీసి రామ్ నాకూ సవాల్ విసిరారు. నేను ఇప్పుడు ‘భగవంత్ కేసరి’తో తెలంగాణలో దిగుతున్నాను అని అన్నారు బాల‌య్య‌. ఇక ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్2’ తో రామ్ మళ్లీ రాబోతుండటం సంతోషం.

ఈ విషయంలో ఆయనది పీహెచ్‌డీ అయిపోయిన‌, నాది ఇంకా డిగ్రీనే అని అన్నారు. రామ్‌ని నేను ఫాలో అవుతున్నా. ‘ఇస్మార్ట్ శంకర్‌2’తో మళ్లీ ఆయన నన్ను ఫాలో అవుతున్నాడంటూ బాలయ్య అన‌గా, దానికి రామ్‌ స్పందిస్తూ ‘నేను చదివే స్కూల్‌లో మీరే హెడ్‌ మాస్టర్‌’ అని అన్నాడు. దానికి బాలయ్య ఆనందంతో ఉప్పొంగిపోయారు.