Bandi Sanjay | బాలిక కేసు నీరుకార్చే యత్నాలు: బండి సంజయ్

ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పార్టీ ఏనాడు చెప్పలేదు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ Bandi Sanjay | విధాత బ్యూరో, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో బాలిక ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. దిశ సంఘటన కంటే ఇది దారుణమైందని ఆవేదన చెందారు. పెద్దపెల్లిలో ఐదు రోజుల క్రితం బాలికపై జరిగిన ఘటనపై ఏంచేయాలో తోచని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, […]

  • Publish Date - August 19, 2023 / 12:20 AM IST
  • ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
  • ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పార్టీ ఏనాడు చెప్పలేదు
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్

Bandi Sanjay |

విధాత బ్యూరో, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో బాలిక ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. దిశ సంఘటన కంటే ఇది దారుణమైందని ఆవేదన చెందారు. పెద్దపెల్లిలో ఐదు రోజుల క్రితం బాలికపై జరిగిన ఘటనపై ఏంచేయాలో తోచని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కలిసి కట్టుకథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధితులనే నిందితులుగా మార్చే కుట్ర తెలంగాణలో సర్వసాధారణమైపోయిందన్నారు.

కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో శనివారం బండి సంజయ్ విలేకరులతో మాట్లాడారు. పెద్దపల్లిలో బాలిక ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదో పోలీసులు కారణం చెప్పాలని నిలదీశారు. ఆ అమ్మాయి ఆడియో టేప్స్ కూడా బయటకొచ్చాక ఇంకా వక్రీకరించడం ఏంటని ప్రశ్నించారు. పెద్దపల్లికి సంబంధించి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి, హైదరాబాద్ కు చెందిన ఓ మంత్రి ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించిన బండి సంజయ్.. కేసును తప్పుదోవ పట్టిస్తున్నవారికి పాపం తగులుతుందన్నారు.

ఈ కేసులో తొలుత నలుగురిని నిందితులుగా గుర్తించి ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. మైనర్ వ్యవహారాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతానన్నారు. అప్పుడు ఇక్కడి పోలీసులు బలి కావల్సి ఉంటుందన్నారు. సిట్టింగ్ జడ్జి తో పెద్దపెల్లి ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సీఎం తీరుపై ఎంపీ ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు తాయిలాలివ్వడం, జీతాలు మొదటి తేదీనే అందజేయడం వంటి స్టంట్స్ చేస్తున్నారని విమర్శించారు. ఈయనను మళ్లీ గెలిపిస్తే ఆ తర్వాత జీతాలు వస్తాయో, రావో ఉద్యోగస్తులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మద్యం టెండర్ల పేరుతో దివాళా తీసిన రాష్ట్ర ఖజానాను డబ్బులతో నింపుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆరోపించారు. అప్పులతో పాటు, అవినీతికి పాల్పడ్డ ఈ ముఖ్యమంత్రి మరోసారి గెలిస్తే ఏం చేయగలడు.. ఎలా పరిపాలించగలడని ప్రశ్నించారు.

డబుల్ ఇంజిన్ సర్కారు అంటేనే.. కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకునే అవకాశముంటుందన్న బండి.. ప్రజలకు ఉపయోగపడే ఏ పథకాలను బీజేపీ రద్దు చేయదని తేల్చిచెప్పారు. ప్రజలు ఈసారి ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని ఏనాడూ కేంద్ర నాయకత్వం చెప్పలేదని.. అయితే, కేంద్ర నాయకత్వం ఎలా చెబితే అలా తాము నడుచుకుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు.