Hyderabad | స్పా ముసుగులో వ్యభిచారం.. ఐదుగురు విటుల అరెస్ట్‌

Hyderabad | విధాత, హైదరాబాద్‌: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు సెంటర్లపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. స్పా సెంటర్లలో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎస్సై కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన ఓ మహిళ… ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. 14 మంది యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఐదుగురు విటులను పోలీసులు […]

  • By: Somu    latest    Aug 29, 2023 12:03 AM IST
Hyderabad | స్పా ముసుగులో వ్యభిచారం.. ఐదుగురు విటుల అరెస్ట్‌

Hyderabad | విధాత, హైదరాబాద్‌: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు సెంటర్లపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. స్పా సెంటర్లలో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎస్సై కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన ఓ మహిళ… ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు.

నిర్వాహకులపై కేసులు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. 14 మంది యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఐదుగురు విటులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక్కో యువతికి వారానికి రూ.15వేలు ఇస్తూ వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు నిర్వాహకులు అంగీకరించారని తెలిపారు.