Bhupalapalli: వేషాలపల్లి డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులో అక్రమాలు

మున్సిపల్ పాలకవర్గంలో ముసలం అర్హులైన జర్నలిస్టులకు దక్కలేదని ఆవేదన బంధువులకు ఇప్పించుకున్నాడని నాయకుడి పై ఆరోపణ ఆధారాలతో సహా అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు విచార‌ణ చేప‌డ‌తామ‌ని హామీ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లిలో ప్రభుత్వం నిర్మించిన 544 డబుల్ బెడ్రూంల కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల విషయంలో కూడా ఒక నాయకుడు అర్హులైన వారికి ఇప్పించకుండా తమ బంధు గణానికి ఇప్పించుకున్నట్లు విమర్శలు వ్యక్తం […]

Bhupalapalli: వేషాలపల్లి డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులో అక్రమాలు
  • మున్సిపల్ పాలకవర్గంలో ముసలం
  • అర్హులైన జర్నలిస్టులకు దక్కలేదని ఆవేదన
  • బంధువులకు ఇప్పించుకున్నాడని నాయకుడి పై ఆరోపణ
  • ఆధారాలతో సహా అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు
  • విచార‌ణ చేప‌డ‌తామ‌ని హామీ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లిలో ప్రభుత్వం నిర్మించిన 544 డబుల్ బెడ్రూంల కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల విషయంలో కూడా ఒక నాయకుడు అర్హులైన వారికి ఇప్పించకుండా తమ బంధు గణానికి ఇప్పించుకున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ వేషాలపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ వ్యవహారం మునిసిపల్ పాలకవర్గంలో ముసలం సృష్టించగా, జర్నలిస్టు నాయకుడి తీరుపై సామాన్య జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు గురువారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై కాకతీయ ప్రెస్ క్లబ్ కమిటీ, జిల్లా ఎస్సి, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ కమిటీ, జిల్లా బీసీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు సంయుక్తంగా గురువారం జిల్లా అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, కొందరు దళారులు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి తమ బంధు వర్గానికి, స్నేహితులకు అర్హత లేకున్నా డబుల్ బెడ్ రూమ్ ఇప్పించారని ఆరోపిస్తూ తగిన ఆధారాలతో అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

దీంతో సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ చేపడతామని, అనర్హులకు కేటాయించిన ఇండ్లను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా ఎవరైనా అర్హత లేకుండా డబుల్ బెడ్ రూమ్ పొందితే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే వాటిపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కాకతీయ ప్రెస్ క్లబ్ కమిటీ కన్వీనర్ నాగపురి శ్రీనివాస్ గౌడ్, కోకన్వీనర్లు రవి భాస్కర్, ఆరెల్లి నరేందర్, బెల్లం తిరుపతి, జల్దీ రమేష్, తిక్క ప్రవీణ్, కొల్లోజు రంజిత్, సామల శ్రీనివాస్, ఎడ్ల సంతోష్, బండ మోహన్, పాలకుర్తి మధు, ఎస్సి, ఎస్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సమ్మయ్య, బిసి డబ్ల్యూ జె జిల్లా ప్రధాన కార్యదర్శి పావుశెట్టి శ్రీనివాస్, కోశాధికారి పసుల రాజు, జిల్లాలోని జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.