Delhi | స్నేహితుడిపై బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు

దక్షిణ ఢిల్లీలోని ఓ ఫ్లాట్‌లో స్నేహితుడు త‌న‌కు మత్తుమందు ఇచ్చి త‌న‌పై లైంగికదాడి చేసిన‌ట్టు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, టెలివిజన్ యాక్టర్ ఆరోపించింది

Delhi | స్నేహితుడిపై బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు
  • నాకు డ్ర‌గ్స్ ఇచ్చిరేప్ చేశాడు
  • నిందితుడిపై కేసు న‌మోదు

Delhi | విధాత‌: దక్షిణ ఢిల్లీలోని ఓ ఫ్లాట్‌లో స్నేహితుడు త‌న‌కు మత్తుమందు ఇచ్చి త‌న‌పై లైంగికదాడి చేసిన‌ట్టు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, టెలివిజన్ యాక్టర్ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేర‌కు ఢిల్లీ పోలీసులు నిందితుడిపై రేప్ కేసు న‌మోదు చేశారు. ప‌రారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్న‌ట్టు పోలీసులు అధికారులు బుధవారం తెలిపారు.


పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ లైంగిక‌దాడి ఘటన 2023లో ఢిల్లీలోని డియోలి రోడ్ ఫ్లాట్‌లో జరుగ‌గా, బాధితురాలు ఆల‌స్యంగా ఫిర్యాదు చేసింది. “నిందితుడు నటిని తన నివాసానికి ఆహ్వానించాడు. అక్కడ ఆమెకు ఆహారం, పానీయాలు ఇచ్చాడు. నిందితుడు ఆమెకు తెలియ‌కుండా డ్రింక్స్‌లో డ్ర‌గ్స్ క‌లిపాడు. ఆపై ఆమెపై లైంగిక దాడిచేశాడు” అని పోలీసువర్గాలు తెలిపాయి. “బిగ్ బాస్” రియాలిటీ షోలో ఆమె పనిచేసిన సమయంలో ఈ నటి ప్రజాదరణ పొందింది. ముంబైకి చెందిన ఆమె మోడల్‌గానూ, టెలివిజన్ సీరియల్స్‌లోనూ పనిచేసింది.


“మేము ఒక వ్యక్తిపై టిగ్రీ పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (రేప్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశా. ఇప్పటివరకు ఎవ‌రినీ అరెస్టు చేయలేదు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటుచేశాం” అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్టు పోలీసులు వెల్లడించారు.