Nalgonda: రామాలయంలో బిక్షంగౌడ్ ప్రమాణం.. సస్పెన్షన్ అక్రమం అంటూ ఆక్షేపణ!

విధాత: నిరాధారమైన అభియోగాలు, నిందలు మోపి అన్యాయంగా నన్ను పిఆర్టియు నలగొండ అధ్యక్ష పదవి నుండి, సంఘం నుండి సస్పెన్షన్ చేశారని ఆక్షేపిస్తూ తన సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ పోరాడుతున్న బిక్షం గౌడ్ బుధవారం మరో అడుగు ముందుకేసి ముందుగా చెప్పినట్లుగానే నల్గొండ రామాలయంలో దేవుడు ఎదుట ప్రమాణం చేశారు. వందలాది మంది పిఆర్టియు ఉపాధ్యాయులు, ప్రజాసంఘాల, పలు పార్టీలకు చెందిన ఆయన మద్దతుదారులు వెంటరాగా బుధవారం సాయంత్రం రామాలయానికి చేరుకున్న బిక్షం గౌడ్ ప్రత్యేక పూజల అనంతరం […]

Nalgonda: రామాలయంలో బిక్షంగౌడ్ ప్రమాణం.. సస్పెన్షన్ అక్రమం అంటూ ఆక్షేపణ!

విధాత: నిరాధారమైన అభియోగాలు, నిందలు మోపి అన్యాయంగా నన్ను పిఆర్టియు నలగొండ అధ్యక్ష పదవి నుండి, సంఘం నుండి సస్పెన్షన్ చేశారని ఆక్షేపిస్తూ తన సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ పోరాడుతున్న బిక్షం గౌడ్ బుధవారం మరో అడుగు ముందుకేసి ముందుగా చెప్పినట్లుగానే నల్గొండ రామాలయంలో దేవుడు ఎదుట ప్రమాణం చేశారు.

వందలాది మంది పిఆర్టియు ఉపాధ్యాయులు, ప్రజాసంఘాల, పలు పార్టీలకు చెందిన ఆయన మద్దతుదారులు వెంటరాగా బుధవారం సాయంత్రం రామాలయానికి చేరుకున్న బిక్షం గౌడ్ ప్రత్యేక పూజల అనంతరం భార్యతో కలిసి దేవుని ఎదుట తాను పిఆర్టియు సంఘానికి వ్యతిరేకంగా పనిచేయలేదని, సంఘానికి వ్యతిరేకంగా ఎవరి నుంచి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేసి సంచలనం రేపారు.

ఈ సందర్భంగా బిక్షం గౌడ్ మాట్లాడుతూ సంఘానికి వ్యతిరేకంగా నేను పనిచేయలేదని ఫైమెన్ కమిటీ పేరుతో నిందలు మోపి సస్పెండ్ చేయడం కుట్రపూరితంగా ఉందన్నారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఈ నెల 2వ తేదీన నల్గొండ జిల్లా పిఆర్టియు కార్యాలయం ఎదుట న్యాయం కోసం నిరసన దీక్ష చేశానన్నారు.

సస్పెన్షన్ ఎత్తివేత కోరుతూ ఏప్రిల్ 4వ తేదీన పిఆర్టియు రాష్ట్ర కమిటీ అధ్యక్షునికి లేఖ ద్వారా కోరానని, నా నిజాయితీని నేను నిరూపించుకునేందుకు రామాలయంలో ప్రమాణం చేస్తానని, మీ ఆరోపణలు నిజమైతే తనతో పాటు దేవుని ఎదుట ప్రమాణానికి రావాలని లేఖలో కోరడం జరిగిందన్నారు.

పిఆర్టియు రాష్ట్ర కమిటీ పెద్దలు తన సవాల్‌ను స్వీకరించలేదని, వారిలో ఎవరు కూడా రామాలయానికి రాలేదని, నేను మాత్రం నా నిజాయితీ నిరూపించుకునేందుకు రామాలయంలో భార్యతో సహా ప్రమాణం చేసినట్లుగా బిక్షం గౌడ్ ప్రకటించారు.

తనకు మద్దతుగా తరలివచ్చిన వందలాది మంది పిఆర్టియు ఉపాధ్యాయులకు, ప్రజా సంఘాల, పార్టీల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా తన పైన విధించిన అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని సంఘంలో కొనసాగేందుకు తనకు అవకాశం కల్పించాలని బిక్షం గౌడ్ కోరారు.