BJP | బీజేపీలో మరో తిరుగుబాటు

BJP ఎంపీ అర్వింద్‌పై ఆర్మూర్ నేతల అసమ్మతి రాష్ట్ర కార్యాలయం వద్ధ ధర్నా విధాత: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్ బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఎంపీ అర్వింద్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, 13మండలాల అధ్యక్షులను మార్చారని, సొంత పార్టీ కార్యాకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నుంచి వచ్చిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు నాంపల్లి బీజేపీ […]

  • Publish Date - July 26, 2023 / 11:44 AM IST

BJP

  • ఎంపీ అర్వింద్‌పై ఆర్మూర్ నేతల అసమ్మతి
  • రాష్ట్ర కార్యాలయం వద్ధ ధర్నా

విధాత: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్ బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఎంపీ అర్వింద్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, 13మండలాల అధ్యక్షులను మార్చారని, సొంత పార్టీ కార్యాకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నుంచి వచ్చిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ధ ఆందోళన చేపట్టి, ఎంపీ అరాచకాలు శృతి మించాయని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి జోక్యం చేసుకుని పార్టీలోని సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు.